త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anganwadi Teachers | రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు.. వ‌చ్చేనెల 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

Anganwadi Teachers | రంగారెడ్డి జిల్లాలో (Rangareddy) ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ టీచర్ (Anganwadi Teachers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 125 అంగన్‌వాడీ టీచర్ల ఖాళీలు ఉన్నాయి.

G

Telangana | Published On Aug 31, 2026, 11.42 am IST

Anganwadi Teachers | రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు.. వ‌చ్చేనెల 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు
Advertisement

Anganwadi Teachers | త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లాలో (Rangareddy) ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ టీచర్ (Anganwadi Teachers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 125 అంగన్‌వాడీ టీచర్ల ఖాళీలు ఉన్నాయి. సోమ‌వారం (ఆగ‌స్టు 31) నుంచి సెప్టెంబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవ‌చ్చు. జిల్లాలోని స్థానిక మ‌హిళ‌లు మాత్ర‌మే అర్హులు. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

చేవెళ్ల ప్రాజెక్టు ప‌రిధిలోని చేవెళ్ల‌, శంక‌ర్‌ప‌ల్లి, షాబాద్‌, మొయినాబాద్ మండ‌లాల్లో మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెంట్ మండ‌ల ప‌రిధిలోని క‌వాడిప‌ల్లి అంగ‌న్‌వాడి కేంద్రం-1, 2తోపాటు తార‌మ‌తిపేట‌లోని అంగ‌న్‌వాడీ సెంట‌ర్‌-2లో మూడు టీచ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు జిల్లాలోని వివిధ మండ‌లాల్లో ఖాళీలు ఉన్నాయి. పోస్టుల‌ వివ‌రాలు, అర్హ‌త‌లు, నియ‌మ నిబంధ‌న‌లు, పూర్తి వివ‌రాల‌కు శిశుసంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ www.wdcw.tg.nic.in, లేదా https://mis.tgwdcw.in/లో తెలుసుకోవచ్చు.

భూపాల‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్ జిల్లాలో..

అదేవిధంగా జ‌య‌శంకర్ భూపాల‌ప‌ల్లి (Bhupalapalli) జిల్లాలో 42 అంగ‌న్‌వాడీ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఆన్‌లైన్ అప్లికేష‌న్లు సెప్టెంబ‌ర్ 2తో ముగియ‌నున్నారు. మ‌హ‌బూబాబాద్ (Mahabubabad) జిల్లాలో అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు,  అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ద‌ర‌ఖాస్తులు సెప్టెంబ‌ర్ 3తో ముగుస్తాయి. స్థానిక అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు అర్హులు.

భూపాల‌ప‌ల్లి జిల్లాలో టీచ‌ర్ పోస్టులు..

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో టీచ‌ర్‌, హెల్ప‌ర్ పోస్టులు..

 

Advertisement
Advertisement