త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Forest | హెచ్‌ఐవీ సోకిందని మహిళను అడవిలో వదిలేశారు..

Forest | జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలో అమానుష‌ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మాన‌వ‌త్వాన్ని మ‌ర‌ణించిన కుటుంబ స‌భ్యులు.. తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌ను అడ‌విలో (Forest) వ‌దిలి వెళ్లారు.

G

Telangana | Published On Aug 22, 2026, 12.54 pm IST

Forest | హెచ్‌ఐవీ సోకిందని మహిళను అడవిలో వదిలేశారు..
Advertisement

Forest | త్రినేత్ర‌.న్యూస్‌: జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలో అమానుష‌ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మాన‌వ‌త్వాన్ని మ‌ర‌ణించిన కుటుంబ స‌భ్యులు.. తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌ను అడ‌విలో (Forest) వ‌దిలి వెళ్లారు. మంచిర్యాల (Mancherial) జిల్లా జైపూర్ మండ‌లం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) హెచ్‌ఐవీతో (HIV) బాధపడుతున్నారు. దీంతో ఆమె క‌రీంన‌గ‌ర్‌లోని ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు.

హాస్పిట‌ల్ నుంచి ఇంటికి తీసుకెళ్తామ‌ని చెప్పిన కుటుంబ సభ్యులు ఆమెను మేడారం-కాటారం రహదారిలోని పెద్దవాగు (Peddavagu) సమీప అడవిలోని చెట్ల పొదల్లో వదిలేసి వదిలి వెళ్లిపోయారు. అనారోగ్యంతో పాటు నిస్సహాయ స్థితిలో ఉన్న లలిత రోధిస్తూ అక్కడే ఉండిపోయారు. ఒంటరిగా ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు.. 108కి సమాచారం అందించారు. దీంతో మహదేవపూర్ సామాజిక ద‌వాఖాన‌కు తరలించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన కుటుంబమే అలా ఒంటరిగా వదిలేయడం ఏంట‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement