Night Shift Buses | రేపటి నుంచి హైదరాబాద్‌లో రాత్రి బస్సులు.. ఏయే రూట్లలో అంటే?
Night Shift Buses | ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ (TGSRTC) ప్రయత్నాలు చేస్తున్నది. రాజధాని హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఇప్పటివరకు రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై బస్సులు కనిపించేవి కాదు.
Night Shift Buses | త్రినేత్ర.న్యూస్: ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ (TGSRTC) ప్రయత్నాలు చేస్తున్నది. రాజధాని హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఇప్పటివరకు రాత్రి 9 గంటలు దాటితే రోడ్లపై బస్సులు కనిపించేవి కాదు. విధులు ముగించుకుని అన్ని బస్సులు డిపోలకు పరుగులుపెట్టేవి. రాత్రి 10 గంటల తర్వాత విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే వారి పరిస్థితి దయనీయంగా ఉండేది. వచ్చే అరకొర బస్సులు ఫుల్ అయ్యేవి. అసలు వస్తాయో రావో.. ఎప్పుడు వస్తాయో అనే విషయం కూడా తెలియకపోది. ఇక వచ్చిన ఆ ఒక్క బస్సునూ అందుకోకపోతే రోడ్లపై నిరీక్షించాల్సి వచ్చేంది. అయితే ఇలాంటి పరిస్థితికి ఆర్టీసీ చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. రాత్రివేళ డిమాండ్ (Night Shift Buses) పెరుగుతుంటంతో బస్సులను నడపాలని నిర్ణయించింది. ప్రధాన మార్గాల్లో సెప్టెంబర్ 1 నుంచి నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులను నడుపనుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు వివిధ మార్గాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఏయే రూట్లలో అంటే..
రూట్ నంబర్ 222 ఏ (కోఠి నుంచి పటాన్‌చెరు వరకు)
కోఠీ నుంచి మొదటి బస్సు రాత్రి 11.40 గంటలకు బయలుదేరుతుంది. చివరి బస్సు 4.30 గంటలకు బయలుదేరుతుంది. పటాన్‌చెరు నుంచి మొదటి బస్సు రాత్రి 11, చివరి బస్సు ఉదయం 4.55 గంటలకు బయలుదేరుతాయి. ప్రతి 45 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుంది. కోఠీ నుంచి అబిడ్స్, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, ఉస్మానియా యూనివర్సిటీ, గుట్టలబేగంపేట్, కొండాపూర్, కోకాపేట తదితర ప్రాంతాల మీదుగా పటాన్‌చెరు వరకు ఈ సర్వీసు నడుస్తుంది. ఈ మార్గంలో ముషీరాబాద్, మియాపూర్-2 డిపోల నుంచి రెండు చొప్పున మొత్తం నాలుగు బస్సులు అందుబాటులో ఉంటాయి.
రూట్ నంబర్ 218 (అఫ్జల్‌గంజ్ నుంచి పటాన్‌చెరు)
అఫ్జల్‌గంజ్ నుంచి మొదటి బస్సు రాత్రి 11.25కు, చివరి బస్సు ఉదయం 3.05 గంటలకు బయలుదేరుతాయి. పటాన్‌చెరు నుంచి రాత్రి 11.20కి మొదటి బస్సు, ఉదయం 3.15 గంటలకు చివరి బస్సు బయలుదేరుతాయి. ప్రతి 1.15 గంటలకో బస్సు ఉంటుంది. సీబీఎస్, కోఠీ, లక్డీకాపూల్, ఎన్‌ఆర్ నగర్, పంజాగుట్ట, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా నడుస్తాయి. కాచిగూడ, మియాపూర్-2 డిపోలకు చెందిన రెండు బస్సులు సేవలు అందిస్తాయి.
రూట్ నంబర్ 219 (సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు)
సికింద్రాబాద్ నుంచి మొదటి బస్సు రాత్రి 11.20కి, చివరి బస్సు ఉదయం 3 గంటలకు, పటాన్‌చెరు నుంచి రాత్రి 11.25కు, చివరి బస్సు ఉదయం 3 గంటలకు అందుబాటులో ఉంటా యి. ప్రతి 1.10 గంటలకో సర్వీస్ నడుస్తుంది. ప్యారడైజ్, ట్యాంక్‌బండ్, బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా ఈ బస్సులు నడుస్తాయి. ఈ మార్గంలో కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన రెండు బస్సులు నడువనున్నాయి.
రూట్ నంబర్ 290యూ (హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్)
హయత్‌నగర్ నుంచి మొదటి బస్సు రాత్రి 11.20కి, చివరి బస్సు ఉదయం 3 గంటలకు, సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.25కు, చివరి బస్సు ఉదయం 3 గంటలకు నడుస్తాయి. ప్రతి 1.15 గంటలకో ఒక బస్సు ఉంటుంది. భాగ్యలత, పనామా, ఎల్‌బీనగర్, నాగోల్, నాగోల్ మెట్రో, స్టేషన్ ఎన్‌జీఆర్‌ఐ, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, రసూల్‌పురా, జేబీఎస్ తదితర ప్రాంతాల మీదుగా నడుస్తాయి. హయత్‌నగర్ డిపో నుంచి 2 బస్సులు, కంటోన్మెంట్ డిపో నుంచి నుంచి ఒక బస్సు నడుస్తాయి.
రూట్ నంబర్ 195 డబ్ల్యూ (బాచుపల్లి నుంచి వేవ్‌రాక్)
బాచుపల్లి నుంచి మొదటి బస్సు రాత్రి 9.15కు, చివరి బస్సు ఉదయం 3.10 గంటలకు బయలుదేరుతాయి. వేవ్‌రాక్ నుంచి రాత్రి 10.25, ఉదయం 4.25 గంటలకు బయలుదేరుతాయి. ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. నిజాంపేట, నిజాంపేట క్రాస్‌రోడ్స్, విప్రో సర్కిల్, ఇన్ఫోసిస్ క్యాంపస్, జేఎన్‌టీయూ, బయోలాజికల్ సిటీ, ఈఎస్‌ఐసీ, ఇంద్రానగర్ తదితర ప్రాంతాలను కలుపుతూ సర్వీస్లు ఉంటాయి. ఈ మార్గంలో మియాపూర్-2 డిపోకు చెందిన 3 బస్సులు సేవలు అందిస్తాయి.
రూట్ నంబర్ 10హెచ్ (కొండాపూర్ నుంచి సికింద్రాబాద్)
కొండాపూర్ నుంచి రాత్రి 10.55కు, చివరి బస్సు ఉదయం 3.40 గంటలకు, సికింద్రాబాద్ నుంచి రాత్రి 10.50కు, చివరి బస్సు ఉదయం 3.40 గంటలకు నడుస్తాయి. ప్రతి 50 నిమిషాలకో సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ప్లాజా, పోలీస్ లైన్స్, ఆర్జే కాలేజ్, స్టేట్ హోమ్, ఉషా కిరణ్, సైబర్ టవర్స్ మీదుగా హెచ్‌సీయూ, రాణిగంజ్ డిపోలకు చెందిన రెండు సర్వీలు నడుస్తాయి.
సంబంధిత వార్తలు

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సెప్టెంబర్ 4, 2026

Razor Blades | బ్లేడ్లు మింగిన బాలుడు.. తొలగించిన ఉస్మానియా వైద్యులు..
సెప్టెంబర్ 4, 2026

Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



