Chanagani Dayakar | ఎంపీపై మార్ఫింగ్ వీడియో.. కొణతం దిలీప్‌ను వెంటనే అరెస్టు చేయండి
Chanagani Dayakar | భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై మార్ఫింగ్ వీడియోలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ కోరారు.
- క్రిశాంక్, తెలుగు స్క్రైబ్, వాయిస్ ఆఫ్ తెలంగాణ, మిర్రర్, శివారెడ్డిలపై కూడా చర్యలు తీసుకోండి
- టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ డిమాండ్
Chanagani Dayakar | త్రినేత్ర న్యూస్: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై మార్ఫింగ్ వీడియోలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ కోరారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను నడుపుతున్న కొణతం దిలీప్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు తప్పడు సంకేతాలు పంపుతూ ప్రజా ప్రతినిధుల ప్రతిష్ట దెబ్బతీసేలా బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈమేరకు మంగళవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. కొణతం దిలీప్‌తో పాటు క్రిశాంక్, తెలుగు స్క్రైబ్, వాయిస్ ఆఫ్ తెలంగాణ, మిర్రర్, శివారెడ్డిలపై తక్షణం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ వీడియోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన వారిపై సుమోటో కేసుగా తీసుకొని అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎంపీల, ప్రతిష్టకు భంగం కలిగించే వీడియోలు సృష్టించి, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలి.
అరెస్టు చేసినా బుద్ధి మారలే..
కొణతం దిలీప్ మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కేటీఆర్ మీద ప్రేమ ఉంటే ఇంకేదన్నా చెయ్. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు వద్దు. గతంలో నిన్ను అరెస్టు చేసి జైలుకు పంపినా నీ బుద్ధి మారలేదు. బీఆర్ఎస్‌లో ఇంకా కొందరు లుచ్చాలు, దొంగలు ఉన్నారు. పొద్దున లేస్తే కాంగ్రెస్‌పై, ప్రభుత్వంపై ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతూ రాక్షసానందం పొందుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చనగాని దయాకర్ ఫైరయ్యారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●INDIA bloc | జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్
- ●Pneumonic Plague | సైబీరియాలో న్యుమోనిక్ ప్లేగ్ కలకలం.. ఏంటిది.. ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి..?
- ●KTR | ఈనాడుకు కేటీఆర్ లీగల్ నోటీసులు..!
- ●KTR | నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.. ఈనాడుపై కేటీఆర్ ఆగ్రహం
- ●Allahabad High Court | మేజరైన కుమార్తెను తమతోనే ఉండేలా తల్లిదండ్రులు బలవంతం చేయలేరు : హైకోర్టు
- ●Indian Stock Market | లార్జ్ క్యాప్స్ వర్సెస్ స్మాల్ క్యాప్స్.. ఇన్వెస్టర్ల చూపు ఎటు వైపు..?

INDIA bloc | జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్

Pneumonic Plague | సైబీరియాలో న్యుమోనిక్ ప్లేగ్ కలకలం.. ఏంటిది.. ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి..?

KTR | ఈనాడుకు కేటీఆర్ లీగల్ నోటీసులు..!

KTR | నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.. ఈనాడుపై కేటీఆర్ ఆగ్రహం





