Monsoon | రెండు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి.. ఇక వానలే వానలు..!
Monsoon | తెలంగాణలోని నైరుతి రుతుపవనాలు( Monsoon ) ఈ నెల 8వ తేదీనే ప్రవేశించాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించలేదు. అయితే రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Monsoon | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని నైరుతి రుతుపవనాలు( Monsoon ) ఈ నెల 8వ తేదీనే ప్రవేశించాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించలేదు. అయితే రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణ( Telangana ) అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రానున్న రెండు మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. అదే దక్షిణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. ఆ ప్రభావంతో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కల్లూరులో 11.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vijay Devarakonda | 14న సొంతూరికి విజయ్ దేవరకొండ, రష్మిక.. తుమ్మెనపేటలో నెలకొన్న సందడి
- ●Hanmakonda | 'బండ రాళ్ల'పై వందల సంఖ్యలో 'సమాధులు'.. మీరు ఓ లుక్కేయండి..!
- ●TG ICET 2026 | ఇవాళ మధ్యాహ్నం టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల
- ●Manjeera | మంజీరా పైప్‌లైన్‌లో భారీ లీకేజీ.. హైదరాబాద్‌లో నీటి సరఫరా బంద్
- ●Horoscope | జూన్ 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!
- ●Indian Sailor Killed | "నాన్నా.. అమెరికా నేవీ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి!" - దాడికి ముందు నావికుడు ఆదిత్య శర్మ లాస్ట్ కాల్, కన్నీరుపెట్టిస్తున్న స్టోరీ

Vijay Devarakonda | 14న సొంతూరికి విజయ్ దేవరకొండ, రష్మిక.. తుమ్మెనపేటలో నెలకొన్న సందడి

Hanmakonda | 'బండ రాళ్ల'పై వందల సంఖ్యలో 'సమాధులు'.. మీరు ఓ లుక్కేయండి..!

TG ICET 2026 | ఇవాళ మధ్యాహ్నం టీజీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల

Manjeera | మంజీరా పైప్‌లైన్‌లో భారీ లీకేజీ.. హైదరాబాద్‌లో నీటి సరఫరా బంద్



