Dasoju Sravan | గద్దెనెక్కినంత మాత్రాన గాడిద గుర్రం కాదు.. సీఎం పీఠంపై కూర్చున్న వీధి రౌడీ రేవంత్: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Dasoju Sravan | గద్దెనెక్కినంత మాత్రాన గాడిద గుర్రం కాదు.. గంధం పూసినంత మాత్రాన పంది నంది కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కతోకకు గుండ్రాయి కట్టినా సక్కగ రాదు అన్నట్లు రేవంత్ రెడ్డి.. నీవు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నంక కూడా, నీ బజారు బుద్ధి, నీ బూతు భాష మరవట్లేదని ధ్వజమెత్తారు.
Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్: గద్దెనెక్కినంత మాత్రాన గాడిద గుర్రం కాదు.. గంధం పూసినంత మాత్రాన పంది నంది కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కతోకకు గుండ్రాయి కట్టినా సక్కగ రాదు అన్నట్లు రేవంత్ రెడ్డి.. నీవు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నంక కూడా, నీ బజారు బుద్ధి, నీ బూతు భాష మరవట్లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవి అనేది ఒక గౌరవం, ఒక బాధ్యత. కానీ అంతటి పవిత్రమైన కుర్చీలో కూర్చుని కూడా బజారు బూతు భాష ప్రయోగిస్తుంటే, అది ఆ పదవికే అవమానమంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిర్యాలగూడలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నువ్వు ఎవడికిరా జాతి పితవు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
చెల్లని రూపాయకు గీతలెక్కువ..
`చెల్లని రూపాయకు గీతలెక్కువ అన్నట్లు, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ, పరిపాలన చేతకాని రేవంత్, నీకు బూతులెక్కువ!! బూతుల రేవంత్ రెడ్డి... ఉద్యమ సందర్భంలో ఆంధ్ర నాయకులు కూడా వాడనంతటి కటువుగా తండ్రి వయస్సులో ఉన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాజ్యాంగ సాధికారత కలిగిన శాసనసభ ప్రతిపక్షనాయకుడు కేసీఆర్‌పై నీ చిల్లర నోరు పారేసుకోవడం, నీ సంస్కార హీనతకు నిదర్శనం.
ప్రజలతో మహానాయకుడిగా కొనియాడబడుతున్న కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా నీవు గుర్తించకపోతే అది నీ మూర్ఖత్వం. కానీ నువ్వు ఒకరాష్ట్ర ముఖ్యమంత్రిగా, 72 ఏండ్ల వయసున్న తండ్రిలాంటి వ్యక్తి,కి ప్రతిపక్ష నాయకుడికి, సాటి మనిషికిచ్చే కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం, వారి వ్యక్తిగత ప్రతిష్టను కాలరాయడం చట్టపరంగా నేరం, ప్రాథమిక హక్కుల ఉల్లఘనే.
ఓట్ల కోసం కుల ఉన్మాదం..
అధికార మదంతో, బూతు భాషతో పిచ్చోడిలెక్క ఊగిపోతున్న నీ దురహంకారం, భారతరాజ్యాంగాన్ని ఉల్లఘించినట్లే. ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. ఒకప్పుడు తెలంగాణ అంటే అభివృద్ధి. కానీ నీ వల్ల తెలంగాణ అంటే బూతు రాజకీయాలకు కేంద్రమైంది.
తెలంగాణ ఉద్యమనాయకుడు, రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ని ఒక కులానికి పరిమితం చేయాలని చూడటం.. తెలంగాణ అస్తిత్వానికే నువ్వు చేస్తున్న విద్రోహం. కేవలం ఓట్ల కోసం కుల ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న నీ తీరు క్షమించరాని నేరం. నీ కుల అహంకారానికి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారు.
పందితో కుస్తీ పడితే..
ఢిల్లీ ఏఐసీసీ అంగట్లో అధికారం కొనుక్కున్నఅహంకారీ రేవంత్. తెలంగాణ సంస్కృతిని, రాజకీయ గౌరవాన్ని, సభ్యత, సంస్కారాన్ని రోడ్డు మీదకు లాగడం దురదృష్టకరం. పందితో కుస్తీ పడితే మన ఒంటికే మురికి అంటుతుందని ఇన్నాళ్లూ నిన్ను వదిలేశాం. కానీ నీ పిచ్చి, నీ ఉన్మాదం రోజు రోజుకు ముదురుతుంది.
రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని వీధి రౌడీలా వాగుతున్న నీవు మనిషివా పశువువా? కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో నీవు నేర్చుకున్నది చింతపండు భూతు భాషేనా? మనిషిని మనిషిగా గౌరవించలేని నీవు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా?. నీ నోటి నుంచి వస్తున్నయి మాటలు కాదు, మలం.
నీది ఏ జాతి.. ఏ నీతి?..
తెలంగాణ సంస్కృతికే నువ్వు ఒక కళంకం. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని వీధి రౌడీలా బూతులు వాగుతున్న నీది ఏ జాతి.. ఏ నీతి?. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన నీది తెలంగాణ ద్రోహుల జాతి.. దండుపాళ్యం దోపిడీ దొంగల జాతి. భూకబ్జాకోర్ల రౌడీ జాతి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన గజదొంగవి. ఆర్ ఆర్ టాక్స్ పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న లఫంగి నువ్వు, నీతి గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది.
గుర్తుంచుకో.. గద్దెనెక్కినంత మాత్రాన గాడిద గుర్రం అయిపోదన్నట్లు, ముఖ్యమంత్రి కుర్చీలో నీవు ఈరోజు కూర్చోవచ్చు, కానీ ఆ పదవితో రావాల్సిన గౌరవం నీకెప్పుడు రాదు రేవంత్. నీ కనీస సభ్యత సంస్కారం లేని నీ నోరు, నీ ఆధిపత్యఅహంకారమే నీ రాజకీయ పతనానికి గోరీ కడుతుంది.
గార్బేజ్ పాలిటిక్స్..
పరిణతిచెందిన ప్రజాస్వామిక స్ఫూర్తితో జరుగాల్సిన విమర్శను, బూతుభాషే రాజకీయ ప్రామాణికమన్నట్లు, తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్నావ్. నీ పాపం పండింది. తెలంగాణ గడ్డ నిన్ను ఎప్పటికీ క్షమించదు. యూ విల్ పే ఫర్ దిస్ వల్గారిటీ అండ్ అబ్యూసివ్ గార్బేజ్ పాలిటిక్స్. నీకు త్వరలో సంఘబహిష్కరణ శిక్ష తప్పదు. బి కేర్ ఫుల్!` అని రేవంత్ రెడ్డిని శ్రవణ్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harvard Medical School | మార్చురీ మేనేజర్ నిర్వాకం.. బ్లాక్మార్కెట్లో మృతదేహాల భాగాల విక్రయం.. 440 కోట్ల పరిహారం..
ఆగస్టు 21, 2026

KCR | మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది.. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి
ఆగస్టు 20, 2026

KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..
- ●EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా
- ●Harvard Medical School | మార్చురీ మేనేజర్ నిర్వాకం.. బ్లాక్మార్కెట్లో మృతదేహాల భాగాల విక్రయం.. 440 కోట్ల పరిహారం..
- ●Boat Capsizes | నైజీరియాలో నీట మునిగిన పడవ.. 50 మందికిపైగా మృతి.. ఎక్కువ మంది చిన్నారులే..

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..

EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా



