త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gadala Srinivasa Rao | ప‌ట్ట‌భ‌ద్రులారా.. జ‌న‌సేన‌కు అండ‌గా నిల‌వండి : గ‌డ‌ల శ్రీనివాస‌రావు

Gadala Srinivasa Rao | తెలంగాణలో సామాజిక న్యాయం కోసం జ‌న‌సేన గ‌ళ‌మెత్తుతుంద‌ని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు జనసేనకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ అభ్య‌ర్థి గ‌డ‌ల శ్రీనివాస‌రావు విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Oct 4, 2026, 6.07 pm IST

Gadala Srinivasa Rao | ప‌ట్ట‌భ‌ద్రులారా.. జ‌న‌సేన‌కు అండ‌గా నిల‌వండి : గ‌డ‌ల శ్రీనివాస‌రావు
Advertisement

Gadala Srinivasa Rao | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో సామాజిక న్యాయం కోసం జ‌న‌సేన గ‌ళ‌మెత్తుతుంద‌ని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు జనసేనకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ అభ్య‌ర్థి గ‌డ‌ల శ్రీనివాస‌రావు విజ్ఞ‌ప్తి చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా చౌటుప్పల్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి జనసేన సమావేశం నిర్వహించారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ గ‌డ్డ‌పై జ‌న‌సేన స‌మ‌ర స‌న్నాహాన్ని విజ‌య‌వంతం చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప‌ట్ట‌భ‌ద్రుల గొంతుక‌గా, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తినిధిగా స‌మిష్టిగా ముందుకు సాగుదామ‌ని శ్రీనివాస రావు పిలుపునిచ్చారు.

సభ్యత్వ నమోదులో విశేష కృషి చేసిన నాయకులను శ్రీనివాస‌రావు సన్మానించారు. ఆముదాల పరమేశ్ ఎన్నికల ప్రచారం కోసం రూ.1 లక్ష విరాళం అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ మమ్ము రెడ్డి ప్రేమ్ కుమార్, రాష్ట్ర నాయకులు మచ్చ సుధాకర్, శర్మ, శిరీష, ప్రజిత్ గౌడ్, మిర్యాల రామకృష్ణ, శివ కార్తీక్, లక్ష్మణ్ గౌడ్, పీక ప్రవీణ్, మామిడాల రమేశ్, శ్రీకాంత్, లింగస్వామి, బద్రి రాజు, పాండు, ప్రవీణ్ తదితరులు, జనసైనికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement