Balmuri Venkat | కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
Balmuri Venkat | మాజీ సీఎం కేసీఆర్ (KCR) అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwarm Project) నిలువెత్తు నిదర్శనమని మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) విమర్శించారు. గత పదేండ్లలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు.
Balmuri Venkat | త్రినేత్ర.న్యూస్: మాజీ సీఎం కేసీఆర్ (KCR) అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwarm Project) నిలువెత్తు నిదర్శనమని మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) విమర్శించారు. గత పదేండ్లలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు దొంగలా ఫామ్‌హౌస్‌లో దాచుకున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ కూలేశ్వరంగా ఎలా చేశారో గాంధీభవన్‌లో పొటొ ప్రదర్శన పెట్టి చూపించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ భవన్‌లో రక్తదానం చేయాల్సింది బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు కాదని, మొదట కేటీఆర్ (KTR) రక్తదానం చేయాలని సవాల్ విసిరారు. ఆ బ్లడ్ శాంపిల్ పంపిస్తే డ్రగ్ టెస్ట్ (Drug Test) చేయిస్తానని చెప్పారు.
అప్పుడు కేటీఆర్ డ్రగ్గిస్టో కాదో తెలుస్తుందని వెల్లడించారు. గతంలో నేను విసిరిన White టెస్ట్ చాలెంజ్‌కు ఆయన భయపడ్డారని ఎద్దేవా చేశారు. గత పదేండ్లలో తెలంగాణలో డ్రగ్ కల్చర్ పెరగడానికి గత బీఆర్ఎస్ పాలకులే కారణమని ఆరోపించారు. కేటీఆర్‌కు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. పదేండ్లు ప్రజల రక్తాన్ని రాబందుల్లా పీల్చుకుతాగి, ఇప్పుడు బ్లడ్ డొనేషన్ (Blood Donation) పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Iran Hit List | ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..
- ●Komatireddy Venkat Reddy | అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ●Maktal | మక్తల్ - నారాయణపేట.. రూ. 237 కోట్లతో నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన
- ●EPFO | కొత్త ఈపీఎఫ్‌వో వ్యవస్థలో వచ్చిన 13 మార్పులు ఇవే.. ఏమేం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయంటే..?
- ●Fahadh Faasil | పుష్ప విలన్‌తో రాజమౌళి కొడుకు తెలుగు హారర్ కామెడీ మూవీ - హీరోయిన్ లేకుండా ప్రయోగం
- ●Supreme Court | అయోధ్య విరాళాల చోరీపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు

Iran Hit List | ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..

Komatireddy Venkat Reddy | అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Maktal | మక్తల్ - నారాయణపేట.. రూ. 237 కోట్లతో నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన

EPFO | కొత్త ఈపీఎఫ్‌వో వ్యవస్థలో వచ్చిన 13 మార్పులు ఇవే.. ఏమేం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయంటే..?






