త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | స్పీక‌ర్ తీర్పు శాస‌న వ్య‌వ‌స్థ చ‌రిత్ర‌లో ఓ చీక‌టి రోజుగా నిలుస్తుంది : వేముల ప్ర‌శాంత్ రెడ్డి

Vemula Prashanth Reddy | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరికి (Kadiam Srihari) స్పీకర్ గడ్డం ప్రసాద్‌ క్లిన్ చిట్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తీవ్రంగా ఖండించారు.

D

Telangana | Published On Mar 11, 2026, 3.01 pm IST

Vemula Prashanth Reddy | స్పీక‌ర్ తీర్పు శాస‌న వ్య‌వ‌స్థ చ‌రిత్ర‌లో ఓ చీక‌టి రోజుగా నిలుస్తుంది : వేముల ప్ర‌శాంత్ రెడ్డి
Advertisement

Vemula Prashanth Reddy | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరికి (Kadiam Srihari) స్పీకర్ గడ్డం ప్రసాద్‌ క్లిన్ చిట్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తీవ్రంగా ఖండించారు. స్పీక‌ర్ నిర్ణ‌యం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తి ని అపహాస్యం చేసినట్టేన‌ని వ్యాఖ్యానించారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి.. ఆ త‌ర్వాత అధికార పార్టీలో ప‌నిచేయ‌డమంటే ప్ర‌జ‌ల తీర్పును తుంగ‌లో తొక్కిన‌ట్టేన‌ని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేంద‌ర్‌కు స్పీక‌ర్ క్లీన్‌చిట్ ఇవ్వ‌డం అంటే ప్ర‌జాస్వామ్యానికి తూట్లు పొడిచి, ప్ర‌జ‌ల తీర్పును పూర్తిగా అవ‌మానించిన‌ట్టేన‌ని వేముల ప్ర‌శాంత్ రెడ్డి పేర్కొన్నారు. "క‌డియం శ్రీ‌హ‌రి కూతురు కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఆ స‌మ‌యంలో క‌డియం శ్రీ‌హ‌రి స్వ‌యంగా కాంగ్రెస్ కండువా వేసుకుని త‌న కూతురి త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. అంతేకాదు, ఇటీవ‌లే జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేసిన అభ్య‌ర్థుల త‌ర‌ఫున బ‌హిరంగంగా ప్ర‌చారం చేసిన విష‌యం ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను చూసి కూడా స్పీక‌ర్ వారికి క్లీన్ చిట్ ఇవ్వ‌డం పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించే చ‌ర్య మాత్ర‌మేకాదు.. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఉప‌యోగిస్తున్నార‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుస్తుంది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర దెబ్బ. ఈ నిర్ణ‌యంతో స్పీక‌ర్ త‌న గౌరవాన్ని తగ్గించుకున్నారు" అని వేముల ధ్వ‌జ‌మెత్తారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచి కాంగ్రెస్ పార్టీలో బ‌హిరంగంగా చేరిన‌ట్టు ఆధారాలు ఉండ‌గా.. దానికి స్పీక‌ర్ క్లీన్ చిట్ ముద్ర వేయ‌టం ప్ర‌జాస్వామ్యంపై దాడి చేయ‌డ‌మేన‌ని వేముల ప్ర‌శాంత్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బ‌తీస్తాయ‌ని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించే ఈ తీర్పు శాస‌న వ్య‌వ‌స్థ చ‌రిత్ర‌లో ఓ చీక‌టి రోజుగా నిలుస్తుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌జ‌లు జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నార‌న్నారు. స‌రైన స‌మ‌యంలో ప్ర‌జ‌లే త‌గిన స‌మాధానం ఇస్తార‌ని వేముల హెచ్చ‌రించారు.

Also Read..

Bandi Sanjay | కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న‌ది: కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌

PM Modi | కేర‌ళ ఎట్ట‌కేల‌కు కేర‌ళంగా మారింది : ప్ర‌ధాని మోదీ

Instagram | ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక చోట్ల ప‌నిచేయ‌ని ఇన్‌స్టాగ్రామ్‌.. ఫిర్యాదు చేస్తున్న యూజ‌ర్లు..

Advertisement
Advertisement