Vemula Prashanth Reddy | కమ్మర్పల్లి రైతుల కేసులను ఉపసంహరించుకోవాలి: వేముల ప్రశాంత్‌రెడ్డి
Vemula Prashanth Reddy | రుణమాఫీ చేయమని అడిగినందుకు కమ్మర్పల్లి (Kammarpally) బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders), రైతులపై(farmers) అక్రమ కేసులు (cases) పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి (MLA Vemula Prashanth Reddy) ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.
త్రినేత్ర.న్యూస్: రుణమాఫీ చేయమని అడిగినందుకు కమ్మర్పల్లి (Kammarpally) బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders), రైతులపై(farmers) అక్రమ కేసులు (cases) పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి (MLA Vemula Prashanth Reddy) ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. గత రెండేండ్లుగా కోర్టుల చుట్టూ తిప్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో 52,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22,000 మంది రైతులకు రుణమాఫీ చేశారన్నారు. ఇంకా 30,000 మంది రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కమ్మర్పల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టి గత రెండేండ్లుగా కోర్టుల చుట్టూ తిప్పించడం కాంగ్రెస్‌కే చెల్లిందన్నారు. శుక్రవారం ఆర్మూర్ కోర్టులో బీఆర్ఎస్ నాయకులు, రైతులు కేసు హియరింగ్‌కు హాజరైనట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేయడం సమంజసమని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. వాటిని నెరవేర్చాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు, రైతులను కోర్టుల చుట్టూ తిప్పించడం అత్యంత బాధాకరమని వాపోయారు. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని, పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వేముల హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



