Instagram | ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల పనిచేయని ఇన్‌స్టాగ్రామ్.. ఫిర్యాదు చేస్తున్న యూజర్లు..
Instagram | ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు యాప్‌ను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. సందేశాలను పంపడం, ఫీడ్ లోడ్ అవడం, డైరెక్ట్ మెసేజ్‌లు (DMs) యాక్సెస్ చేయడం వంటి ఫీచర్లలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అనేక మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
Technology | Published On Mar 11, 2026, 2.46 pm IST
Instagram | ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు యాప్‌ను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. సందేశాలను పంపడం, ఫీడ్ లోడ్ అవడం, డైరెక్ట్ మెసేజ్‌లు (DMs) యాక్సెస్ చేయడం వంటి ఫీచర్లలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని అనేక మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. మెటా సంస్థకి చెందిన ఈ యాప్‌లో సమస్యలు బుధవారం ఉదయం భారత కాలమానం ప్రకారం సుమారు 8:45 గంటల సమయంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రియల్ టైమ్ మానిటరింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం 10వేలకు పైగా ఫిర్యాదులు నమోదు అయ్యాయని వెల్లడైంది. యూజర్లు తెలిపిన సమస్యల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు డౌన్‌డిటెక్టర్ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ డౌన్ పేరిట హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్..
భారత్‌లో కూడా అనేక మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ సమస్యలపై ఫిర్యాదు చేశారు. అందులో 85 శాతం మంది మొబైల్ యాప్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరో 12 శాతం మంది వెబ్‌సైట్ ద్వారా ఆ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సుమారు 4 శాతం మంది తమ ఫీడ్‌లో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కొందరి టైమ్‌లైన్‌లు పూర్తిగా ఫ్రీజ్ అయినట్లు తెలిపారు. ఇక ఈ అంతరాయంపై ఎక్స్ లో కూడా యూజర్లు పెద్దఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు. #InstagramDown పేరిట హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కొందరు యాప్‌ను పూర్తిగా యాక్సెస్ చేయలేకపోతున్నట్లు పేర్కొనగా, మరికొందరు ప్రత్యేక ఫీచర్లలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
మెసేజ్‌లు కనిపించడం లేదు..
దాదాపు రెండు గంటల క్రితం నా మెసేజ్ పేజీలో ఒక్క మెసేజ్ కూడా కనిపించలేదు. నాకు చాలా మెసేజ్‌లు ఉన్నప్పటికీ ఏవీ చూపించలేదు. అంతకు ముందు రెండు నోటిఫికేషన్లు కూడా వచ్చాయి.. అని ఒక యూజర్ కామెంట్ చేయగా, ఇన్‌స్టాగ్రామ్‌లో నా మెసేజ్‌లు, కాంటాక్ట్‌లు కనిపించడం లేదు. సెర్చ్ టూల్ ఉపయోగించలేకపోతున్నాను, పైకి స్క్రోల్ చేయడం కూడా సాధ్యం కావడం లేదు. మొత్తం యాప్ పూర్తిగా పనిచేయడం లేదు.. అని మరో యూజర్ పోస్టు పెట్టాడు. మరో వినియోగదారు డౌన్‌డిటెక్టర్ పేజీలో స్పందిస్తూ.. నా మాక్‌బుక్‌లో ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌సైట్ లోడ్ కావడం లేదు. నేను ప్రతిరోజూ దాన్ని ఉపయోగిస్తాను. ఈరోజు మాత్రం అసలు తెరుచుకోవడం లేదు. యూట్యూబ్, స్నాప్‌చాట్, స్పాటిఫై వంటి ఇతర యాప్‌లు మాత్రం సరిగా పనిచేస్తున్నాయి.. అని పేర్కొన్నాడు.
స్పందించని మెటా..
డౌన్‌డిటెక్టర్ గణాంకాల ప్రకారం అమెరికా నుంచి 10వేలకిపైగా ఫిర్యాదులు వచ్చినట్లు తేలింది. లాస్ ఏంజెలెస్, ఫీనిక్స్, చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో వినియోగదారులు ఎక్కువగా సమస్యలను తెలిపినట్లు హీట్ మ్యాప్‌లో కనిపిస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి కూడా సుమారు 170 ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ అంతరాయంపై మెటా సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదా వివరణ ఇవ్వలేదు. విస్తృత స్థాయిలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంస్థ స్పందన కోసం యూజర్లు ఎదురుచూస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Meta Layoffs | మెటాలో మొదలైన లేఆఫ్స్.. ఉదయం 4 గంటలకే మెయిల్స్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



