Munnuru Kapu Trust Board | ఆత్మగౌరవ భవన్ నిర్మాణం వేగవంతం చేయాలి.. మున్నూరుకాపు ట్రస్ట్ బోర్డు నిర్ణయం
Munnuru Kapu Trust Board | హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో నిర్మాణంలో ఉన్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన్ (మున్నూరుకాపు టవర్స్) పనులను మరింత వేగవంతం చేయాలని మున్నూరుకాపు ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. ఫౌండేషన్ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Munnuru Kapu Trust Board | హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో నిర్మాణంలో ఉన్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన్ (మున్నూరుకాపు టవర్స్) పనులను మరింత వేగవంతం చేయాలని మున్నూరుకాపు ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. ఫౌండేషన్ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం కోకాపేటలో ఐదు ఎకరాల భూమిని ఆత్మగౌరవ భవన్ నిర్మాణం కోసం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.
నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అవసరమైన చర్యలపై చర్చించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో స్థిరపడిన మున్నూరుకాపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన రశీదును ఫౌండేషన్ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర ఆయనకు అందజేశారు. వసుంధరా బిల్డ్ ఎక్స్ ఛైర్మన్, కాపు నాయకుడు పోతురెడ్డి రమేష్ బాబు ప్రత్యేక ఆహ్వానితుడిగా సమావేశానికి హాజరయ్యారు. గతంలో ఇచ్చిన రూ.10 లక్షల విరాళానికి కొనసాగింపుగా భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తానని ఆయన ప్రకటించారు.
అనంతరం రమేష్ బాబు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గంగుల కమలాకర్‌తో పాటు ఫౌండేషన్ సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు సర్థార్ పుటం పురుషోత్తమరావు, వీ ప్రకాశ్, సీ విఠల్, రౌతు కనకయ్య, తూడి ప్రవీణ్, రమేష్ హజారీ, మంగళారపు లక్ష్మణ్, పన్నాల విష్ణువర్థన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతురెడ్డి రమేష్ బాబును ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గంగసాని నవీన్ పటేల్, జెన్నాయికోడే జగన్మోహన్, బేతంచర్ల శ్రీనివాస్ నాయుడు తదితరులు హాజరయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Suriya-Jyothika | 20 ఏళ్ల తర్వాత మరోసారి సూర్య–జ్యోతిక పెళ్లి!
సెప్టెంబర్ 16, 2026

Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!
సెప్టెంబర్ 16, 2026

Vishwambhara | ‘విశ్వంభర’పై మెగాస్టార్‌దే తుది నిర్ణయం..! రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో..!
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●EPFO wage | ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.25,000కు పెంపు
- ●Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు
- ●Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!
- ●UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం
- ●Indian Stock Market | రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●UPI | రూ.2వేలు దాటితే యూపీఐ ఛార్జ్.. క్రెడిట్ కార్డుతో పోలిస్తే ఎంత?

EPFO wage | ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.25,000కు పెంపు

Revanth Reddy Assembly Speech | ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టం ద్వారా భూములకు విముక్తి కల్పించారు

Disha Patani | నిన్న కృతి సనన్.. నేడు దిశా పటానీ.. బాలీవుడ్ హాట్ బ్యూటీపై ట్రోలింగ్..!

UPI payments | ఎలాంటి విదేశీ ఒత్తిడీ లేదు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం



