Ponnam vs Adi Srinivas | కబడ్డీ ఆడిన మంత్రులు పొన్నం, ఆది శ్రీనివాస్..
Ponnam vs Adi Srinivas | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడల్లో క్రీడాకారులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ కలిసి కబడ్డీ ఆడారు.
Ponnam vs Adi Srinivas | త్రినేత్ర న్యూస్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడల్లో క్రీడాకారులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ కలిసి కబడ్డీ ఆడారు. రాష్ట్ర స్థాయి బాల, బాలికల కబడ్డీ క్రీడోత్సవాల్లో విజయం సాధించిన జట్లకు మంత్రులు బహుమతులను ప్రదానం చేశారు.

సోమవారం రాత్రి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఫైనల్ మ్యాచ్ వీక్షించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఫైనల్ బాలికల మ్యాచ్ లో కొత్తగూడెం జిల్లా బాలికల జట్టు ఖమ్మం జిల్లా జట్టుపై విజయం సాధించగా, ఫైనల్ బాలుర మ్యాచ్‌లో వనపర్తి జిల్లాపై నల్గొండ జిల్లా జట్టు విజయం సాధించింది అని తెలిపారు. క్రీడాకారులతో కలిసి సరదాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి కబడ్డీ ఆడటం జరిగిందన్నారు.

కిందపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్
ఇక క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడుతున్న క్రమంలో ఊహించని ఘటన జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ నుంచి తప్పించుకునేందుకు వెనక్కి వెళ్లగా, ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఈ ఘటనలో పొన్నం ప్రభాకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పోలీసులు, నాయకులు, క్రీడాకారులు ఊపిరి పీల్చుకున్నారు.
కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి పొన్నం
వేములవాడలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో ఘటన https://t.co/5giQVNwlrj
— Telugu Scribe (@TeluguScribe) October 5, 2026
తాజావార్తలు
- ●Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్
- ●Mettu Sai Kumar | మన్నె క్రిశాంక్‌పై కఠిన చర్యలు తీసుకోండి
- ●Horoscope | అక్టోబర్ 6 రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికుల మధ్య అపార్థాలు..!
- ●Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం
- ●Bheemgal SI Tirupati | పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం: ఎస్సై వేధింపులే కారణమంటూ వేముల ఫైర్.. రేపు 'భీమ్‌గల్ బంద్'కు పిలుపు
- ●Justice PS Koshy Telangana High Court | హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ పీఎస్ కోషి: సుప్రీంకోర్టుకు జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్

Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్

Mettu Sai Kumar | మన్నె క్రిశాంక్‌పై కఠిన చర్యలు తీసుకోండి

Horoscope | అక్టోబర్ 6 రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికుల మధ్య అపార్థాలు..!

Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం





