Nagarkurnool | అచ్చంపేట మీదుగా ఎలివేటెడ్ కారిడార్
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్‌లో రూ.146.71 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి పనులకు శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. వనపర్తి-1 ప్యాకేజీ కింద అచ్చంపేట ఫేజ్-1లో ఈ పనులను చేపట్టనున్నారు.
- మంత్రి జుపల్లి కృష్ణారావు
- మంత్రి కోమటిరెడ్డితో కలిసి రోడ్ల పనులకు శంకుస్థాపన
- బల్మూర్‌లో రూ.146.71కోట్లతో రహదారి పనులకు శ్రీకారం
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్‌లో రూ.146.71 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి పనులకు శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. వనపర్తి-1 ప్యాకేజీ కింద అచ్చంపేట ఫేజ్-1లో ఈ పనులను చేపట్టనున్నారు. రూ.32.99 కోట్లతో అమ్రాబాద్–తొల్పలపల్లి రహదారిని పదర, వాంకేశ్వరం, చిట్లముకుంట, ఉడిమిల్ల, ఇప్పలపల్లి గ్రామాల మీదుగా కిలోమీటర్ 0/000 నుంచి 34/200 వరకు బలోపేతం చేయనున్నారు. రూ.35.71 కోట్లతో బల్మూర్–నాగర్‌కర్నూల్ పీడబ్ల్యూడీ రహదారిని బల్మూర్, గోడల్, తుమ్మన్‌పేట గ్రామాల మీదుగా రెండు లేన్లుగా విస్తరించనున్నారు. మరో రూ.78.01 కోట్లతో అచ్చంపేట–రాకొండ రహదారిని ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి మీదుగా రెండు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రహదారుల నిర్మాణం, ఉన్నతీకరణకు ప్రభుత్వం రూ.2,963 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రహదారులకు మహర్దశ వచ్చిందని పేర్కొన్నారు. రూ.7,600 కోట్ల వ్యయంతో హైదరాబాద్–శ్రీశైలం–నంద్యాల జాతీయ రహదారిలో భాగంగా మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అచ్చంపేట నియోజకవర్గం మీదుగా సాగుతుందని మంత్రి తెలిపారు. శంషాబాద్ నుంచి అచ్చంపేట మీదుగా బెంగళూరు వరకు బుల్లెట్ రైలు రానుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత వాసిగా అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రోడ్ల విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రోడ్ల విస్తరణ, మరమ్మతులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Techie | ట్రావెల్ వీడియోల కోసం.. ఏడాదికి రూ.85 లక్షల ప్యాకేజీ ఉద్యోగాన్ని వదులుకున్న టెకీ
- ●Jeevan Reddy | రేవంత్.. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చెయ్
- ●Tollywood | ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో - న్యూజిలాండ్‌లో వివాహ వేడుకలు
- ●Keralam Travel | కేరళంలో ఈ ప్రదేశాలు చూస్తే.. ప్రకృతి అందాలకు ఫిదా అవ్వాల్సిందే!
- ●Vinod Kumar | పాలిటెక్నిక్ విద్యనే వద్దట.. అది చెప్పడానికి అసలు ఆకునూరి మురళి ఎవరు?
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్

Techie | ట్రావెల్ వీడియోల కోసం.. ఏడాదికి రూ.85 లక్షల ప్యాకేజీ ఉద్యోగాన్ని వదులుకున్న టెకీ

Jeevan Reddy | రేవంత్.. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చెయ్

Tollywood | ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో - న్యూజిలాండ్‌లో వివాహ వేడుకలు

Keralam Travel | కేరళంలో ఈ ప్రదేశాలు చూస్తే.. ప్రకృతి అందాలకు ఫిదా అవ్వాల్సిందే!






