Tollywood | ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో – న్యూజిలాండ్‌లో వివాహ వేడుకలు
టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు సాయి మాచిరాజుతో ప్రిన్స్ వివాహం ఆదివారం న్యూజిలాండ్‌లో జరిగింది. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Aug 24, 2026, 1.22 pm IST
Tollywood | టాలీవుడ్ హీరో ప్రిన్స్ ఓ ఇంటివాడయ్యారు. ప్రియురాలు సాయి ప్రతిమ మాచిరాజుతో ప్రిన్స్ పెళ్లి ఆదివారం జరిగింది. న్యూజిలాండ్‌లో జరిగిన వివాహ వేడుకలో ప్రిన్స్, సాయి మాచిరాజు కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. ప్రిన్స్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. .
లవ్‌స్టోరీకి గ్రీన్‌సిగ్నల్...
గత ఏడాది ఓ స్నేహితుడి పెళ్లి వేడుకలో సాయి మాచిరాజుతో ప్రిన్స్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. వీరి లవ్‌స్టోరీకి ఇరువురి కుటుంబసభ్యులు ఓకే చెప్పినట్లు తెలిసింది. పెద్దల అంగీకారంతో ఈ జంట ఏడడుగులు వేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
బస్‌స్టాప్‌తో సక్సెస్...
తేజ దర్శకత్వంలో రూపొందిన నీకు నాకు డాష్ డాష్ మూవీతో హీరోగా ప్రిన్స్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. మారుతి దర్శకత్వంలో రూపొందిన బస్‌స్టాప్‌తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత రొమాన్స్, మనసు మాయ సేయకే తో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా కనిపించాడు. నేను శైలజ, మిస్టర్, డీజే టిల్లు, స్కందతో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ వన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రిన్స్ ఏడో వారంలో హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Keralam Travel | కేరళంలో ఈ ప్రదేశాలు చూస్తే.. ప్రకృతి అందాలకు ఫిదా అవ్వాల్సిందే!
- ●Vinod Kumar | పాలిటెక్నిక్ విద్యనే వద్దట.. అది చెప్పడానికి అసలు ఆకునూరి మురళి ఎవరు?
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
- ●Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం
- ●Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..
- ●Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్

Keralam Travel | కేరళంలో ఈ ప్రదేశాలు చూస్తే.. ప్రకృతి అందాలకు ఫిదా అవ్వాల్సిందే!

Vinod Kumar | పాలిటెక్నిక్ విద్యనే వద్దట.. అది చెప్పడానికి అసలు ఆకునూరి మురళి ఎవరు?

Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం






