Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి
Minister Komati Reddy | నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రోడ్లుమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నల్గొండ క్లబ్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్‌ను మంత్రి ప్రారంభించారు.
Minister Komati Reddy | నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రోడ్లుమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నల్గొండ క్లబ్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్లబ్ ఆహ్లాదకర వాతావరణంలో ఉందని, పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. క్లబ్ అభివృద్ధికి తన సహకారం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. నల్గొండ పట్టణానికి 24 గంటల తాగునీటి సరఫరా కోసం రూ.125 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి పట్టణవాసులకు నిరంతర నీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
2028 ఆగస్టుకు ఎస్‌ఎల్‌బీసీ
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను పూర్తి చేయడం తన ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నిధులు సమీకరించి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. 2028 ఆగస్టు నాటికి ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ అంచనా వ్యయం రూ.2 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు పెరిగిందని, సొరంగం పనుల్లో ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించినట్లు మంత్రి వివరించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నీటిపారుదల ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు
నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు నల్గొండను ఆధునిక, ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం దాదాపు రూ.1,400 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు. పట్టణంలో రూ.300 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
- ●CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్
- ●H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!
- ●Bollywood | తమన్నాతో టీవీ నటుడి ఎంగేజ్మెంట్ - ఫొటోలు వైరల్
- ●OBC Leaders Support Konda Surekha | కాంగ్రెస్‌లో ముదురుతున్న 'కొండా' ఎపిసోడ్: సురేఖకు ఓబీసీ సంఘం అండ.. అధిష్ఠానం తీరుపై ఫైర్!

Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్

H1N1 | హెచ్1ఎన్1పై ఆందోళన వద్దు.. ఐసీఎంఆర్ క్లారిటీ..!




