త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sharvari Wagh | కొన్ని సెకన్లే.. కానీ ఎంతో నేర్పాయి..! శర్వరి వాఘ్ ఆసక్తికర విషయాలు

Sharvari Wagh | బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది యువ నటి శర్వరి వాఘ్. కథానాయికగా అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే విభిన్నమైన కథలు, బలమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకుంటోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలపై దృష్టి పెడుతూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది.

P

Entertainment | Published On Aug 23, 2026, 7.30 pm IST

Sharvari Wagh | కొన్ని సెకన్లే.. కానీ ఎంతో నేర్పాయి..! శర్వరి వాఘ్ ఆసక్తికర విషయాలు
Advertisement

Sharvari Wagh | బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది యువ నటి శర్వరి వాఘ్. కథానాయికగా అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే విభిన్నమైన కథలు, బలమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకుంటోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలపై దృష్టి పెడుతూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా తన సినీ ప్రయాణానికి ముందు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రధాన నటిగా వెండితెరపై కనిపించకముందు తాను అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేసినట్లు శర్వరి వెల్లడించింది. కెరీర్ ప్రారంభ దశలో యాడ్స్‌లో నటించే సమయంలో ఎదురైన అనుభవాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పింది. ముఖ్యంగా కెమెరా ముందు కొన్ని సెకన్లు మాత్రమే కనిపించినా.. ఆ సమయంలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా నటించాల్సిన అవసరాన్ని అక్కడే నేర్చుకున్నానని తెలిపింది. సినిమాల్లో ఒక సన్నివేశాన్ని పండించడానికి ఎక్కువ సమయం ఉండొచ్చు. కానీ ప్రకటనల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని శర్వరి వివరించింది.

ఎంతసేపు కనిపించామనేది కాదు..

కొన్ని సెకన్లలోనే దర్శకుడు కోరుకున్న భావోద్వేగాన్ని సరిగ్గా పలికించాల్సి ఉంటుందని చెప్పింది. కెమెరా ముందు ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదని.. లభించిన సమయాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకున్నామన్నదే అసలు విషయమని అప్పుడే అర్థమైందని పేర్కొంది. యాడ్ షూటింగ్స్‌లో పనిచేసిన సమయంలో చిన్న చిన్న షాట్లకు కూడా పూర్తి స్థాయిలో శ్రమించడం అలవాటైందని శర్వరి తెలిపింది. దర్శకుడు చెప్పిన ఎమోషన్‌ను వెంటనే అర్థం చేసుకుని, దాన్ని హావభావాల ద్వారా ప్రేక్షకులకు చేరవేయడం తన నటనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పింది. ఆ అనుభవమే సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెద్ద పాత్రలను మరింత నమ్మకంగా చేయడానికి పునాదిగా మారిందని పేర్కొంది. తొలి రోజుల్లో ఎదురైన ప్రతి అవకాశం తనకు ఓ పాఠం నేర్పిందని శర్వరి చెబుతోంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే తపన, సెట్‌లో ప్రతి ఒక్కరి నుంచి విషయాలను గమనించే అలవాటు తనను నటిగా ఎదగడానికి దోహదపడిందని తెలిపింది. చిన్న యాడ్ షూట్ అయినా, భారీ సినిమా సెట్స్ అయినా.. ప్రతి అనుభవాన్ని కెరీర్‌లో భాగంగానే చూస్తానని చెప్పింది.

శర్వరి సినీ ప్రయాణం..

శర్వరి సినీ ప్రయాణం విషయానికి వస్తే.. మొదటి నుంచీ ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న విషయం స్పష్టమవుతుంది. నటిగా తనను తాను నిరూపించుకునే అవకాశాల కోసం కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తోంది. గ్లామర్‌తో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనూ మెప్పిస్తూ బాలీవుడ్‌లో తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. ముఖ్యంగా ఎలాంటి బలమైన సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం శర్వరి ప్రయాణంలో చెప్పుకోదగ్గ విషయం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఒక్కో సినిమాతో తన నటనా అవకాశాలను దక్కించుకుంటున్నది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిభతో ఎదుగుతున్న యువ నటీమణుల్లో శర్వరి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శర్వరి.. భవిష్యత్తులోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి సినిమాతో కొత్తదనం చూపించాలని కోరుకుంటున్న ఆమె నుంచి మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. శర్వరి చివరగా అల్ఫా మూవీలో కనిపించింది. ప్రస్తుతం యే ప్రేమ్‌ మోల్‌ లియాతో పాటు అలీ అబ్బాస్‌ సినిమాలో నటిస్తోంది.

Advertisement
Advertisement