Keralam Travel | కేరళంలో ఈ ప్రదేశాలు చూస్తే.. ప్రకృతి అందాలకు ఫిదా అవ్వాల్సిందే!
Keralam Travel | పచ్చని కొండలు.. మైమరిపించే జలపాతాలు.. నిశ్శబ్దంగా సాగిపోయే బ్యాక్‌వాటర్స్.. అలలతో పలకరించే సముద్ర తీరం.. సంప్రదాయ పడవలు, కాలనీయ కాలం నాటి వీధులు.. ఇలా ప్రకృతి, సంస్కృతి, చరిత్ర కలగలిసిన పర్యాటక స్వర్గధామం కేరళం. ఒకే రాష్ట్రంలో భిన్నమైన అనుభూతులు దొరకడం బహుశ కేరళం సాధ్యం. సాధారణ పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రశాంతమైన, అంతగా రద్దీ లేని ప్రదేశాలూ ఇక్కడ చాలానే ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలపై ఓ లుక్కేద్దాం పదండి..!
Keralam Travel | పచ్చని కొండలు.. మైమరిపించే జలపాతాలు.. నిశ్శబ్దంగా సాగిపోయే బ్యాక్‌వాటర్స్.. అలలతో పలకరించే సముద్ర తీరం.. సంప్రదాయ పడవలు, కాలనీయ కాలం నాటి వీధులు.. ఇలా ప్రకృతి, సంస్కృతి, చరిత్ర కలగలిసిన పర్యాటక స్వర్గధామం కేరళం. ఒకే రాష్ట్రంలో భిన్నమైన అనుభూతులు దొరకడం బహుశ కేరళం సాధ్యం. సాధారణ పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రశాంతమైన, అంతగా రద్దీ లేని ప్రదేశాలూ ఇక్కడ చాలానే ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలపై ఓ లుక్కేద్దాం పదండి..!
మున్నార్.. మేఘాల మాటున తేయాకు తోటలు

పచ్చని టీ తోటలు.. కొండలను కప్పేసే పలుచటి పొగమంచు.. చల్లని వాతావరణం.. మలుపులు తిరుగుతూ సాగే కొండ దారులు.. ఇవన్నీ కలిస్తే మున్నార్. ఎటుచూసినా పచ్చదనమే కనిపించే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కొండలపై నుంచి కనిపించే లోయలు, సూర్యోదయ-సూర్యాస్తమయ దృశ్యాలు మున్నార్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కోరుకునేవారికీ ఇది మంచి గమ్యస్థానంగా నిలుస్తుంది.
అలప్పుజ.. నీటిపై ప్రయాణం..

కేరళ బ్యాక్‌వాటర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అలప్పుజ. కాలువల మధ్య పచ్చని కొబ్బరి చెట్లు.. ఇళ్ల మధ్య నుంచి నెమ్మదిగా సాగిపోయే పడవలు.. నీటిపై తేలుతున్నట్టుగా కనిపించే సంప్రదాయ హౌస్‌బోట్లు.. ఇవన్నీ ఇక్కడి ప్రత్యేకత. హౌస్‌బోట్‌లో ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తే నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి పర్యాటకులకు కలుగుతుంది.
వాగమన్.. ప్రశాంతమైన కొండలు..

పర్యాటకుల రద్దీకి దూరంగా కాస్త ప్రశాంతంగా గడపాలనుకునేవారికి వాగమన్ అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా నిలుస్తుంది. పచ్చని మైదానాలు, పైన్ అడవులు, కొండలపై నుంచి కనిపించే అందమైన దృశ్యాలు ఇక్కడి ప్రత్యేకత. ప్రకృతితో మమేకమై కొంత సమయం గడపాలనుకునేవారికి ఈ ప్రాంతం ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీకి కూడా ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు కనిపిస్తాయి.
మున్రో ఐలాండ్.. కాలువల మధ్య..

బ్యాక్‌వాటర్స్‌ను మరో కోణంలో ఆస్వాదించాలంటే మున్రో ఐలాండ్ వెళ్లొచ్చు. ఇరుకైన కాలువలు, పచ్చని చెట్లు, నీటికి ఆనుకుని ఉన్న ఇళ్లు ఈ ద్వీపానికి ప్రత్యేక అందాన్ని తీసుకొస్తాయి. చిన్న పడవలు, కానోల్లో కాలువల మధ్య ప్రయాణిస్తే కేరళ గ్రామీణ జీవితం మరింత దగ్గరగా కనిపిస్తుంది. స్థానికుల రోజువారీ జీవనశైలి, ప్రకృతితో వారి అనుబంధం ఈ ప్రయాణంలో ప్రత్యేక అనుభూతిని మిగులుస్తాయి.
వర్కల.. సూర్యాస్తమయానికి ప్రత్యేకం..

సముద్రతీరానికి ఆనుకుని ఉన్న కొండచరియలు వర్కలను ఇతర బీచ్‌ల నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయి. పై నుంచి అరేబియా సముద్రాన్ని చూస్తూ గడపడం, సాయంత్రం వేళ సూర్యాస్తమయం ప్రధాన ఆకర్షణ. కొండపై ఉన్న బీచ్‌ఫ్రంట్ కేఫ్‌లు, దుకాణాలు పర్యాటకులకు మరో అనుభూతిని అందిస్తాయి. ప్రకృతి అందాలతో పాటు కాస్త సందడి కోరుకునేవారికీ వర్కల బాగా నచ్చుతుంది.
టెక్కడి.. అడవిలో సాహసం

అడవి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి టెక్కడి బెస్ట్ డెస్టినేషన్. దట్టమైన పచ్చని అడవులు, వన్యప్రాణులు ఇక్కడి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పెరియార్ సరస్సులో పడవ ప్రయాణం చేస్తూ అటవీ ప్రాంతాన్ని తిలకించొచ్చు. అదృష్టం కలిసొస్తే ఏనుగులు, వివిధ రకాల పక్షులు సహా అడవిలోని వన్యజీవులను చూసే అవకాశం ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం మంచి అనుభూతిని అందిస్తుంది.
కొచ్చి.. చరిత్రకు వారధి

కేరళం పర్యటనలో చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలనుకుంటే కొచ్చిని తప్పక చూడాల్సిందే. కాలనీయ కాలం (బ్రిటిష్ కాలం) నాటి భవనాలు, పాత వీధులు, చారిత్రక ప్రాంతాలతో పాటు ఆధునిక కేఫ్‌లు, కళా ప్రదర్శనశాలలు ఇక్కడ కనిపిస్తాయి. సముద్ర తీరంలో కనిపించే చైనీస్ ఫిషింగ్ నెట్స్ కొచ్చికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. గతం, వర్తమానం ఒకే చోట కనిపించే నగరం ఇది.
అతిరప్పిల్లి.. నీటి
హోరుతో ప్రకృతి సోయగం
కేరళంలోని అద్భుతమైన జలపాతాల్లో అతిరప్పిల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఎత్తు నుంచి ఉధృతంగా కిందికి దూకే నీటి ధారలు, చుట్టూ దట్టమైన పచ్చని అడవులు కలసి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. వర్షాకాలంలో జలపాతం మరింత ఉద్ధృతంగా మారి చూపరులను ఆకట్టుకుంటుంది. అందుకే దీన్ని తరచూ ‘భారతదేశపు నయాగరా’గా అభివర్ణిస్తుంటారు.
కుమరకోమ్.. పక్షుల కిలకిలల మధ్య

బ్యాక్‌వాటర్స్ అందాలను ఆస్వాదించడంతో పాటు పక్షులను వీక్షించాలనుకునేవారికి కుమరకోమ్ ప్రత్యేక ఆకర్షణ. ప్రశాంతమైన నీటి ప్రవాహాలు.. పచ్చని పరిసరాలు, పక్షుల సంరక్షణ కేంద్రం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ప్రకృతి మధ్య నెమ్మదిగా సమయం గడపాలనుకునేవారికి ఇది అనువైన ప్రదేశం.
కోవలం.. సముద్రపు ఒడిలో సేదతీరం

చంద్రవంక ఆకారంలో విస్తరించిన బీచ్‌లు కోవలం ప్రత్యేకత. ప్రశాంతంగా సముద్రతీరంలో గడపడం, అలలతో సేదతీరడం, సాయంత్రం సూర్యాస్తమయాన్ని వీక్షించడం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. తీరానికి సమీపంలోని లైట్‌హౌస్ ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతుంది. కుటుంబంతోనైనా, స్నేహితులతోనైనా ప్రశాంతమైన బీచ్ విహారానికి కోవలం బెస్ట్ ఆప్షన్.
ప్రకృతి ఒడిలో.. ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతి

మున్నార్ కొండలు.. అలప్పుజ బ్యాక్‌వాటర్స్.. వాగమన్ మైదానాలు.. మున్రో ఐలాండ్ కాలువలు.. వర్కల సముద్రపు కొండచరియలు.. థెక్కడి అడవులు.. కొచ్చి చరిత్ర.. అథిరప్పిళ్లి జలపాతాలు.. కుమరకోమ్ పక్షుల ప్రపంచం.. కోవలం బీచ్‌లు. ఇలా కేరళంలో అడుగుపెట్టిన ప్రతి చోటా ప్రకృతి మరో రూపంలో పలకరిస్తుంది. అందుకే కేరళను ఒక్కసారి చూసి వచ్చేయాలనుకునే గమ్యస్థానం కంటే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రయాణ అనుభూతిగా పర్యాటకులు భావిస్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kerala Monsoon Tourism | జూన్ వర్షాల్లో ‘కేరళ’ ట్రిప్.. ప్రకృతి ఒడిలో రీఫ్రెష్ అయ్యేందుకు బెస్ట్ డెస్టినేషన్!
జూన్ 7, 2026

Elephant Padayappa | మున్నార్‌లో పడయప్ప విశ్వరూపం.. కారుపై దాడి చేసి విధ్వంసం
జూన్ 4, 2026

Indigo Flight | మిడ్ ఎయిర్‌లో ఏసీ బంద్.. ఇండిగో విమానంలో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Vinod Kumar | పాలిటెక్నిక్ విద్యనే వద్దట.. అది చెప్పడానికి అసలు ఆకునూరి మురళి ఎవరు?
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
- ●Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం
- ●Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..
- ●Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్
- ●Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హరీశ్ రావు

Vinod Kumar | పాలిటెక్నిక్ విద్యనే వద్దట.. అది చెప్పడానికి అసలు ఆకునూరి మురళి ఎవరు?

Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం

Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..



