త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Govt | మ‌రో ముగ్గురి విప్‌ల‌కు మంత్రి హోదా..

Telangana Govt | ప్ర‌భుత్వ విప్‌ల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో ముగ్గురి విప్‌ల‌కు మంత్రి హోదా క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు( Sanjay Jaju ) ఉత్త‌ర్వులు జారీ చేశారు.

S

Telangana | Published On Jul 21, 2026, 6.28 pm IST

Telangana Govt | మ‌రో ముగ్గురి విప్‌ల‌కు మంత్రి హోదా..
Advertisement

Telangana Govt | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌భుత్వ విప్‌ల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress Govt ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో ముగ్గురి విప్‌ల‌కు మంత్రి హోదా క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు( Sanjay Jaju ) ఉత్త‌ర్వులు జారీ చేశారు. తాజాగా మంత్రి హోదా పొందిన ముగ్గురు విప్‌ల‌లో చింత‌కుంట విజ‌య ర‌మ‌ణారావు(పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యే), వేముల వీరేశం(న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే), యెన్నం శ్రీనివాస్ రెడ్డి(మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే) ఉన్నారు.

తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బ‌ల్మూరి వెంకట్‌లకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హోదా కల్పిస్తూ ఈ నెల 15న‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్రోటోకాల్, మర్యాదలు

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. మంత్రి హోదా పొందిన విప్‌ల‌కు రాష్ట్ర అధికారిక ప్రోటోకాల్ లోని ఆర్టికల్ 18 ప్రకారం వీరు గౌరవాన్ని పొందుతారు. వీరు పదవిలో ఉన్నంత కాలం మాత్రమే ఈ ప్రత్యేక హోదా వర్తిస్తుంది.

Advertisement
Advertisement