Narsampet | రాత్రికిరాత్రే గద్దె కూల్చివేత.. నర్సంపేటలో బీఆర్ఎస్ నేతల ధర్న.. ఉద్రిక్తత
Narsampet | వరంగల్ జిల్లా నర్సంపేటలో (Narsampet) ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) నేతలు ధర్నాకు దిగారు.
Narsampet | త్రినేత్ర.న్యూస్: వరంగల్ జిల్లా నర్సంపేటలో (Narsampet) ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) నేతలు ధర్నాకు దిగారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన విగ్రహాన్ని నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించారు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి లేదంటూ ఆదివారం రాత్రి అధికారులు దానిని కూల్చివేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు అధికారుల తీరుకు నిరసనగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao), మాజీ ఎంపీ వినోద్ రావు ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాకు (Dharna) దిగారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి (Congress) వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత ఏర్పాడింది. ధర్నా కారణంగా నర్సంపేట- మహబూబాబాద్, నర్సంపేట- కొత్తగూడ, నర్సంపేట- ములుగు మార్గాల్లో రాకపోకలు నిలిచి పోయాయి.
దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మించిన గద్దె కూల్చివేత
విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ కూల్చివేసిన మున్సిపాలిటీ… https://t.co/gZjVuE4hOv pic.twitter.com/G0l7Z5jSiy
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
నర్సంపేటలో ఉద్రిక్తత
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు
ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్… https://t.co/0nG3HuFphb pic.twitter.com/JF1m9IXSwv
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2026
సంబంధిత వార్తలు

KCR Visits Peddi Sudarshan Reddy Family | ‘నేనున్నా’.. పెద్ది పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు పెట్టుకున్న కేసీఆర్
ఆగస్టు 9, 2026

KCR | ‘పెద్ది’ కుటుంబ సభ్యులకు కేసీఆర్ పరామర్శ
ఆగస్టు 9, 2026

Chamala Kirankumar Reddy | కేటీఆర్.. నువ్ జల ఉద్యమం చేయాల్సిన పని లేదు.. ప్రజలే నీకు జల సమాధి కడతరు
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Security Guard | ఉద్యోగంలో చేరిన నాలుగు రోజులకే.. మహిళపై సెక్యూరిటీ గార్డ్ అఘాయిత్యం
- ●IPO | ఈ వారంలో ఐపీవోల జాతర.. ఇన్వెస్టర్లకు అలర్ట్..
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత..
- ●Somasila | కృష్ణానదిలో పెరిగిన నీటిమట్టం.. సోమశిలలో బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభం
- ●Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి
- ●Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..

Security Guard | ఉద్యోగంలో చేరిన నాలుగు రోజులకే.. మహిళపై సెక్యూరిటీ గార్డ్ అఘాయిత్యం

IPO | ఈ వారంలో ఐపీవోల జాతర.. ఇన్వెస్టర్లకు అలర్ట్..

Stock Markets | స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత..

Somasila | కృష్ణానదిలో పెరిగిన నీటిమట్టం.. సోమశిలలో బోటింగ్ సేవలు మళ్లీ ప్రారంభం



