Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
Varuna Yagam | రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో వరుణయాగం (Varuna Yagam) నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దంపతులు సాగర్‌లోని (Nagarjuna Sagar) విజయ్ విహార్ కృష్ణా నది వద్ద ప్రారంభించారు.
Varuna Yagam | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్‌లో వరుణయాగం (Varuna Yagam) నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దంపతులు సాగర్‌లోని (Nagarjuna Sagar) విజయ్ విహార్ కృష్ణా నది వద్ద (Krishna River) ప్రారంభించారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు. 11 హోమగుండాలు ఏర్పాటు చేశారు. 108 మంది రుత్వికులు, అర్చకులు, వేదపండితులు రోజంతా ప్రత్యేక వైదిక క్రతువులు నిర్వహిస్తారు. కృష్ణా–గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని, జలాశయాలు, చెరువులు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, వ్యవసాయినిక సమృద్ధిగా నీరు అందాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వరుణ యాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. గోపూజ, విశ్వక్సేన పూజ, యాగశాల ప్రవేశాన్ని రుత్వికులు చేయించారు. మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లో హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.45 గంటలకు సాగర్ హిల్‌కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి విజయ విహార్ ప్రాంగణంలో జరుగుతున్న మహాయాగానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.
తాజావార్తలు
- ●AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
- ●Horoscope | ఆగస్టు 10 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని మార్పులు ఉండవచ్చు!
- ●Free Online Education | ఆన్లైన్లో చదువు ఉచితం.. అయినా లక్షల ఫీజులు ఎందుకు కడుతున్నారు? భవిష్యత్తులో స్కూళ్లు ఉంటాయా?
- ●Bengal Tea Farmer Abducted | బెంగాల్ సరిహద్దుల్లో కలకలం: పొలంలో ఉన్న రైతన్నను కంచె దాటించి ఎత్తుకెళ్లిన బంగ్లాదేశీయులు
- ●Telangana DGP CV Anand | ఒకప్పుడు నక్సలిజం.. ఇప్పుడు సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ : పోలీసులకు వరంగల్ సవాల్
- ●KCR Visits Peddi Sudarshan Reddy Family | 'నేనున్నా'.. పెద్ది పిల్లలను అక్కున చేర్చుకుని కన్నీరు పెట్టుకున్న కేసీఆర్

AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్

Horoscope | ఆగస్టు 10 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని మార్పులు ఉండవచ్చు!

Free Online Education | ఆన్లైన్లో చదువు ఉచితం.. అయినా లక్షల ఫీజులు ఎందుకు కడుతున్నారు? భవిష్యత్తులో స్కూళ్లు ఉంటాయా?

Bengal Tea Farmer Abducted | బెంగాల్ సరిహద్దుల్లో కలకలం: పొలంలో ఉన్న రైతన్నను కంచె దాటించి ఎత్తుకెళ్లిన బంగ్లాదేశీయులు






