త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | గెలుపున‌కు తొలిమెట్టు ఓటమి.. విజ‌యం సాధించాల‌న్న క‌సి విద్యార్థుల్లో పెర‌గాలి: మంత్రి వాకిటి శ్రీహ‌రి

Vakiti Srihari | ఓట‌మి గెలుపున‌కు తొలిమెట్టు అని మంత్రి వాకిటి శ్రీహ‌రి (Vakiti Srihari) అన్నారు. ఓట‌మికి కుంగిపోకుండా మ‌ళ్లీ విజ‌యం ఎలా సాధించాల‌నే క‌సి విద్యార్థుల్లో పెర‌గాల‌ని చెప్పారు.

G

Telangana | Published On Jun 6, 2026, 11.43 am IST

Vakiti Srihari | గెలుపున‌కు తొలిమెట్టు ఓటమి.. విజ‌యం సాధించాల‌న్న క‌సి విద్యార్థుల్లో పెర‌గాలి: మంత్రి వాకిటి శ్రీహ‌రి
Advertisement

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: ఓట‌మి గెలుపున‌కు తొలిమెట్టు అని మంత్రి వాకిటి శ్రీహ‌రి (Vakiti Srihari) అన్నారు. ఓట‌మికి కుంగిపోకుండా మ‌ళ్లీ విజ‌యం ఎలా సాధించాల‌నే క‌సి విద్యార్థుల్లో పెర‌గాల‌ని చెప్పారు. చిన్నచిన్న సమస్యలకే విద్యార్థులు మానసికంగా కుంగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలు మాత్రమే మానసిక, శారీరక ధ్రుడత్వాన్ని కలగ జేస్తాయని తెలిపారు. విద్యార్థులు ఫోన్ల‌కు కాకుండా, మైదానాలకు అలవాటుపడాలని సూచించారు. గచ్చిబౌలిలో నెలరోజులకుపైగా సాగుతున్న వేసవి శిక్షణా శిబిరం ముగింపు వేడుకలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 24 నుంచి జూన్ 7 వరకు జరిగిన ఈ సమ్మర్ క్యాంపులో 600 మంది విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతీ సంవత్సరం వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

యువ‌త మత్తు వదలి మైదానాలు చేరాలనే నినాదంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని అన్ని మైదానాలను అభివృద్ధి చేసి మంచి నైపుణ్యం ఉన్న కోచ్‌లను నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈసారి క్రీడలకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు. సీఎం కప్ సెకండ్ ఎడిషన్‌లో భాగంగా దాదాపు 3 లక్షల మంది పిల్లలు గ్రామీణ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు ఆడారని చెప్పారు. ఇప్పుడు 3వ ఎడిషన్‌లో 5 లక్షల క్రీడాకారులను పాల్గొనేలా చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ సందర్బంగా సమ్మర్ క్యాంపు లో శిక్షణ పొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement