Vakiti Srihari | యువత మత్తు వదలి మైదానాలు చేరాలి: మంత్రి వాకిటి శ్రీహరి
Vakiti Srihari | యువత క్రీడల్లో (Sports) రాణించి రాష్ట్రానికి గర్వకారణం కావాలని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని చెప్పారు.
Vakiti Srihari | త్రినేత్ర.న్యూస్: యువత క్రీడల్లో (Sports) రాణించి రాష్ట్రానికి గర్వకారణం కావాలని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని చెప్పారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిలో భాగంగా నిర్వహిస్తున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత మత్తు వదలి మైదానాలు చేరాలన్నారు. తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని వెల్లడించారు.
విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు మానసికంగా కుంగి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. ఓడిపోతే మళ్లీ గెలవడమనేది ఒక్క క్రీడల్లోనే సాధ్యమని చెప్పారు. ప్రతీ రోజు ఓ రెండు గంటలు గ్రౌండ్‌లో ఉండేలా కృషి చేయాలన్నారు. క్రీడల్లో క్రమశిక్షణ చాలా అవసరమని తెలిపారు. క్రీడలపై ఆశ, శ్వాస, ధ్యాస ఉండాలని, అప్పుడే క్రీడల్లో రానించగల్గుతామని వెల్లడించారు. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశానికి ఒలంపిక్స్‌లో రావాల్సినన్ని పతకాలు రాకపోవడం శోఛనీయమని పేర్కొన్నారు.

తెలంగాణ కన్నా చిన్నదైన దక్షిణ కొరియా వంటి దేశాలు ఒలంపిక్స్‌లో గణనీయమైన పతకాలు సాధిస్తున్నాయని చెప్పారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసే ప్రయత్నంలో సీఎం కప్ నిర్వహించి జాతీయస్థాయిలో ఆడే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్ర ప్రతిష్టను పెంపొందించాలి. రాష్ట్ర ప్రభుత్వం యువత, క్రీడాకారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.
యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇలాంటి వారోత్సవాలు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. ప్రతి యువకుడు క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని, మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



