Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..
Minister Vakiti Srihari | జూరాల ప్రాజెక్టు నీటి విడుదల అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా వాడుకుంటూ ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. నీటి లభ్యత, తాగునీటి అవసరాలు, భవిష్యత్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం శాస్త్రీయంగా, బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.
రైతులను తప్పుదోవ పట్టించొద్దు
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బాధ్యతతో ఉన్నాం
మీడియాతో మంత్రి వాకిటి శ్రీహరి
Minister Vakiti Srihari | త్రినేత్ర.న్యూస్ : జూరాల ప్రాజెక్టు నీటి విడుదల అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా వాడుకుంటూ ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. నీటి లభ్యత, తాగునీటి అవసరాలు, భవిష్యత్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం శాస్త్రీయంగా, బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
జూరాల నీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్నవేనని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం, దక్షిణ భారతదేశంలోని వర్షపాత పరిస్థితులు, కర్ణాటక నుంచి వచ్చే ప్రవాహం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి నిర్వహణ చేస్తున్నామని చెప్పారు.
“రైతులకు నీరు ఇవ్వడం మా బాధ్యత. అదే సమయంలో ప్రజల తాగునీటి అవసరాలను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుతం ఉన్న నీటినంతా ఒక్కసారిగా విడుదల చేసి రాబోయే నెలల్లో తాగునీటి కోసం ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టడం బాధ్యతాయుతమైన ప్రభుత్వ విధానం కాదు” అని మంత్రి స్పష్టం చేశారు.
కర్ణాటక ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు
జూరాలకు నీటి ప్రవాహం పెంచే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి తెలిపారు. “ఫ్లో ప్రారంభమైన వెంటనే రైతులకు అవసరమైన నీటిని దశలవారీగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని భరోసా ఇచ్చారు. రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించి సంయమనం పాటించాలని ప్రభుత్వం కోరుతుంటే, బీఆర్ఎస్ నాయకులు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని శ్రీహరి ఆరోపించారు.
తాజావార్తలు
- ●Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే
- ●Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
- ●OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..
- ●Brahmotsavam 2026 | భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం
- ●Abortion | అబార్షన్ విషయంలో మహిళదే తుది నిర్ణయం.. బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు
- ●NYTTA | న్యూయార్క్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే

Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక

OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

Brahmotsavam 2026 | భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం





