Vakiti Srihari | ప్రతి పేదవాడి గుండెలో ఎర్ర సత్యం బతికే ఉన్నాడు : మంత్రి వాకిటి
Vakiti Srihari | జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం ప్రతి పేదవాడి గుండెలో బతికే ఉన్నాడని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఎర్ర సత్యం ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ప్రజానాయకుడని కొనియాడారు. సత్యమన్న పేరు వినని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరని శ్రీహరి తెలిపారు.
Vakiti Srihari | త్రినేత్ర.న్యూస్ : జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం ప్రతి పేదవాడి గుండెలో బతికే ఉన్నాడని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఎర్ర సత్యం ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ప్రజానాయకుడని కొనియాడారు. సత్యమన్న పేరు వినని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరని శ్రీహరి తెలిపారు. ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వాకిటి శ్రీహరి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పండగ సాయన్న తర్వాత పేదవాళ్లకి న్యాయం చేసిన మహోన్నత వ్యక్తి సత్యమన్న అని ఆయన కొనియాడారు. నమ్ముకున్న సిద్దాంతం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి అని మంత్రి పేర్కొన్నారు. పండగ సాయన్న స్ఫూర్తితో పెద్దోళ్లను కొట్టి పేదోళ్ళకి పంచిన మహానుభావుడని తెలియజేశారు.
ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారికి అండగా నిలిచిన ఎర్ర సత్యం జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, సాట్స్ మాజీ చైర్మన్ శివసేనా రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ఎర్ర సత్యం కుటుంబ సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ
- ●Jr NTR | ఎన్టీఆర్కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!
- ●Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..
- ●Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ
- ●Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
- ●Dasoju Sravan | రాయదుర్గం సాక్షిగా 7 ఎకరాల భూ దోపిడీ : ఎమ్మెల్సీ దాసోజు

Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ

Jr NTR | ఎన్టీఆర్కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!

Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..

Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ






