Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
Revanth Reddy | డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను వసూలు చేయాలని.. అందుకు ఒక విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. క్యాబినెట్ సబ్ కమిటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
- మిల్లర్లు బ్లాక్‌మెయిల్ చేస్తే సహించను
- సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్ సమీక్షలో సీఎం రేవంత్ హెచ్చరిక
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను వసూలు చేయాలని.. అందుకు ఒక విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. క్యాబినెట్ సబ్ కమిటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకొని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సివిల్ సప్లయిస్ డిపార్ట్‌మెంట్‌పై బుధవారం నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.
బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలి. మిల్లర్ల బ్లాక్ మెయిల్‌ను సహించను. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకొని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలి. అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తా. మార్కెట్‌లో ఉన్న గోడౌన్ లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.

5 నియోజకవర్గాల్లో మహిళా సంఘాలకు 50 నుంచి 100 ఎకరాల్లో గోడౌన్ ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టాలి. ధాన్యం ఎక్కువ దిగుబడి అయ్యే ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలి. గోడౌన్‌ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని నిధులను వినియోగించుకోవాలి. ప్రతి జిల్లాకు నోడల్ అధికారిని నియమించాలి అని అధికారులకు రేవంత్ సూచించారు.
ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vehicle Thefts in India | దేశంలో ప్రతి 2.3 నిమిషాలకు ఒక వాహనం చోరీ.. తెలంగాణలో ఎన్ని ఎత్తుకుపోయారంటే?
- ●Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి
- ●Stock Markets | తీవ్ర అస్థిరతతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాటా చైర్మన్ ప్రకటనతో షేర్లు భారీగా పతనం..
- ●IndiGo | విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. ప్రయాణికుల్లో టెన్షన్
- ●Ponnam Prabhakar | 14న మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణ
- ●Revamped Gold Monetisation Scheme | భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల నిధి.. వృథాగా మూలనపడ్డ బంగారంతో కేంద్రం 'గోల్డెన్' స్కీమ్!

Vehicle Thefts in India | దేశంలో ప్రతి 2.3 నిమిషాలకు ఒక వాహనం చోరీ.. తెలంగాణలో ఎన్ని ఎత్తుకుపోయారంటే?

Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి

Stock Markets | తీవ్ర అస్థిరతతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాటా చైర్మన్ ప్రకటనతో షేర్లు భారీగా పతనం..

IndiGo | విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. ప్రయాణికుల్లో టెన్షన్




