Dasoju Sravan | రాయదుర్గం సాక్షిగా 7 ఎకరాల భూ దోపిడీ : ఎమ్మెల్సీ దాసోజు
Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన బినామీలు రాయదుర్గం సాక్షిగా 7 ఎకరాల భూ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు.
Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన బినామీలు రాయదుర్గం సాక్షిగా 7 ఎకరాల భూ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. రూ. 1700 కోట్ల విలువైన భూమిని రేవంత్ రెడ్డి వంశీరామ్, అపర్ణ బిల్డర్స్‌కు టెండర్లు లేకుండా, అగ్రిమెంట్స్ లేకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అతి చౌకగా కట్టబెట్టాడు. రేవంత్ రెడ్డి కుటుంబం కోట్ల రూపాయల కమీషన్ దండుకుంటున్నారు అని ఆరోపించారు. రాయదుర్గంలో నిర్మాణంలో ఉన్న పీఎం ఏక్తా మాల్ కుంభకోణంపై దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.

దేశవ్యాప్తంగా పీఎం ఏక్తా యూనిటీ మాల్స్‌కు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు మాల్‌కు కేటాయించింది. 27 అంతస్తులతో 27 లక్షల స్క్వేర్ ఫీట్లతో మాల్ నిర్మాణం. ప్రభుత్వ వాటా కేవలం 9 లక్షల చదరపు అడుగులు. వంశీరామ్, అపర్ణ బిల్డర్స్ వాటా 18 లక్షల చదరపు అడుగులు అని దాసోజు శ్రవణ్ తెలిపారు.
టెండర్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్‌లో లేదు
రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఏం చదువుకుండో ఎవరికి తెలియదు. కొండల్ రెడ్డికి సడన్‌గా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చైర్మన్ అయిపోతాడు. కొండల్ రెడ్డి కంపెనీకి వందల కోట్ల విలువ చేసే భూమి రేవంత్ రెడ్డి ఇచ్చేసిండు. అనుముల కుటుంబం అనకొండల్లాగా దోచుకుంటున్నారు. పీఎం ఏక్తా మాల్ నిర్మాణ అగ్రిమెంట్ దొరుకుతుందేమో అని మొత్తం చూసాం. వేలకోట్ల రూపాయల భూమి.. ఎక్కడ కూడా టెండర్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్‌లో లేదు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు భూములు దోచిపెడుతున్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా లోన్‌లో కొంత సీఎం రేవంత్ రెడ్డి, వంశీరామ్ బిల్డర్ దొబ్బుకు పోయారు అంటున్నారని శ్రవణ్ తెలిపారు.

బీజేపీ నాయకులు గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా?
కేంద్రం నుంచి వడ్డీ లేని రుణంగా వచ్చిన రూ.200 కోట్లతో పాటు, రూ.1,700 కోట్ల విలువైన ఈ అత్యంత ఖరీదైన భూమిని రేవంత్ రెడ్డి తన బినామీ సంస్థలకే దోచి పెడుతున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ ఆఫ్ రూ.200 కోట్లు లోన్ ఇచ్చింది. నరేంద్ర మోదీ పేరు మీద నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లో అవినీతి జరుగుతుంటే బీజేపీ నాయకులు గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా? రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ వాళ్లకు కళ్లే కనబడటం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ కుమ్మక్కు అయిపోయి చిల్లర దోపిడీకి పాల్పడుతున్నారు. శ్రీధర్ బాబు గారు.. మీరు నీతి నిజాయితీ ఉన్నవాళ్లు అయితే ఈ టెండర్లను క్యాన్సల్ చేయండి. టెండర్ డాక్యుమెంట్లు పట్టుకు రండి.. తెలంగాణ అమరవీరుల సాక్షిగా చర్చ చేద్దామని దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు.
భూ దోపిడీని అడ్డుకుని తీరుతాము..
ఇష్టం వచ్చినట్లు దొంగ అగ్రిమెంట్లు, టెండర్లు చేసి వేల కోట్ల రూపాయలు పందికొక్కుల లాగా దోచుకుని తింటాము అంటే కర్రు కాల్చి అధికారులకు కూడా వాతలు పెడతామని హెచ్చరించారు. రాయదుర్గంలో జరుగుతున్న ఈ భూ దోపిడీని అడ్డుకుని తీరుతాము.. దీని మీద మేము గవర్నర్, సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద నేరస్థుడో ఆయనకి కొమ్ము కాస్తున్న అధికారులు కూడా అంతే నేరస్థులు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీని నడుపుతున్నది ఐఏఎస్ జయేష్ రంజన్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి అని ఆరోపించారు.
తాజావార్తలు
- ●Vehicle Thefts in India | దేశంలో ప్రతి 2.3 నిమిషాలకు ఒక వాహనం చోరీ.. తెలంగాణలో ఎన్ని ఎత్తుకుపోయారంటే?
- ●Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి
- ●Stock Markets | తీవ్ర అస్థిరతతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాటా చైర్మన్ ప్రకటనతో షేర్లు భారీగా పతనం..
- ●IndiGo | విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. ప్రయాణికుల్లో టెన్షన్
- ●Ponnam Prabhakar | 14న మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణ
- ●Revamped Gold Monetisation Scheme | భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల నిధి.. వృథాగా మూలనపడ్డ బంగారంతో కేంద్రం 'గోల్డెన్' స్కీమ్!

Vehicle Thefts in India | దేశంలో ప్రతి 2.3 నిమిషాలకు ఒక వాహనం చోరీ.. తెలంగాణలో ఎన్ని ఎత్తుకుపోయారంటే?

Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి

Stock Markets | తీవ్ర అస్థిరతతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాటా చైర్మన్ ప్రకటనతో షేర్లు భారీగా పతనం..

IndiGo | విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. ప్రయాణికుల్లో టెన్షన్




