త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddam Prasad Kumar | నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్ర‌శ్నించిన‌ స్పీకర్

Gaddam Prasad Kumar | అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు రెండో రోజు కొన‌సాగుతున్నాయి. స‌భ ప్రారంభం కాగానే స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Gaddam Prasad Kumar) త‌న స్థానంలోకి వ‌స్తుండ‌గా.. మా మ‌హిళా స‌భ్యుల మీద దాడి జ‌రిగితే స్పందించ‌రా స్పీక‌ర్ గారు.. అంటూ హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు.

G

Telangana | Published On Sep 8, 2026, 10.34 am IST

Gaddam Prasad Kumar | నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్ర‌శ్నించిన‌ స్పీకర్
Advertisement

Gaddam Prasad Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు రెండో రోజు కొన‌సాగుతున్నాయి. స‌భ ప్రారంభం కాగానే స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Gaddam Prasad Kumar) త‌న స్థానంలోకి వ‌స్తుండ‌గా.. మా మ‌హిళా స‌భ్యుల మీద దాడి జ‌రిగితే స్పందించ‌రా స్పీక‌ర్ గారు.. అంటూ హ‌రీశ్ రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. ఇదేమైనా కౌర‌వ స‌భ‌నా అని నిల‌దీశారు. దీనికి ప్ర‌తిగా స్పీక‌ర్ మాట్లాడుతూ.. త‌న త‌ల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని హరీశ్‌రావును స్పీకర్​ ప్రశ్నించారు. ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి అంటూ హ‌రీశ్ రావుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  సబిత, సునీతపై జరిగిన దాడికి సంబంధించి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.

సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. మహిళా సభ్యులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement