త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sanjay | మ‌గ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మ‌గ పోలీసులా..!

MLA Sanjay | మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులను పెట్టారు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులను పెట్టారు.. రేవంత్ రెడ్డి ఇదేనా నీ సంస్కారం.. రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉందా..? మహిళల పట్ల రేవంత్ రెడ్డి తీరు ఇదా.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల సంజ‌య్ నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Sep 8, 2026, 11.08 am IST

MLA Sanjay | మ‌గ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మ‌గ పోలీసులా..!
Advertisement

MLA Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులను పెట్టారు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులను పెట్టారు.. రేవంత్ రెడ్డి ఇదేనా నీ సంస్కారం.. రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉందా..? మహిళల పట్ల రేవంత్ రెడ్డి తీరు ఇదా.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల సంజ‌య్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద డాక్ట‌ర్ సంజ‌య్ మంగ‌ళ‌వారం ఉద‌యం మీడియాతో మాట్లాడారు.

నిన్న మమ్మల్ని అసెంబ్లీకి వెళ్లనివ్వకుండా మా చుట్టూ ఆడ కానిస్టేబుళ్లను పెట్టారు. వాళ్ల వెనకాల ఉన్న పోలీసులు, ఆ మహిళా కానిస్టేబుళ్లను మా మీదకు తోస్తున్నారు. మా మహిళా ఎమ్మెల్యేలను మగ పోలీసులు చీర పట్టి లాగి, గొంతు పిసికి, జుట్టు పట్టి లాగి అసభ్యంగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి సంస్కారహీనుడు.. డీసీపీ నీ సంస్కారం, చదువు ఎక్కడికి పోయింది తల్లి. మగ పోలీసులు మా మహిళా ఎమ్మెల్యేల చీర లాగడం, ఇదా డీసీపీ మీ సంస్కారం, మీ చదువు. పోలీసుల ఫోటోలు ఉన్నాయి.. తప్పించుకుంటామని అనుకుంటున్నారేమో వదిలిపెట్టం అని సంజ‌య్ హెచ్చ‌రించారు.

ఈ ప్రభుత్వంలో నిన్న మహిళా ఎమ్మెల్యేలకు జరిగినట్లు తెలంగాణలో ఏ మహిళకు జరిగినా, మా బీఆర్ఎస్ సైనికులం చట్టం చేతుల్లోకి తీసుకొని కాపాడుతాం. కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిన సైనికులం మేము.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమ‌ని తేల్చిచెప్పారు.

తాతా మధు ఎవరినో ఒక మాట అంటే దాన్ని కాంగ్రెస్ నాయకులు స్పీక‌ర్‌కు ఆపాదించారు. అసలు స్పీక‌ర్‌ను అవమానించింది కాంగ్రెస్ నాయకులే. మూడేళ్లుగా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు, ఇంకెన్ని రోజులు చేస్తారు? అధికార మదంతో విర్రవీగకండి, బాధ్యతతో వ్యవహరించండి. రేవంత్ రెడ్డి భాష వల్లే తెలంగాణలో మహిళలపై క్రైమ్ రేట్ పెరిగింది అని డాక్ట‌ర్ సంజ‌య్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement