Jagga Reddy | నేను ఒకటేసారి ‘కోడి’ని తిన్నట్టు ఉంది.. ‘మేడిగడ్డ’ కథ : జగ్గారెడ్డి
Jagga Reddy | నేను ఒకటేసారి కోడిని తిన్నట్టు ఉంది మేడిగడ్డ కథ అని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. కోడిని బాగా తిని రేవంత్ రెడ్డిని తిడితే ఎట్ల..? అని జగ్గారెడ్డి నిలదీశారు.
Jagga Reddy | త్రినేత్ర.న్యూస్ : నేను ఒకటేసారి కోడిని తిన్నట్టు ఉంది మేడిగడ్డ కథ అని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. కోడిని బాగా తిని రేవంత్ రెడ్డిని తిడితే ఎట్ల..? అని జగ్గారెడ్డి నిలదీశారు. గాంధీ భవన్‌లో బుధవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ కూలిన అంశానికి ఓ కోడి కథను ఇంటర్ లింక్ చేసి చెప్పారాయన.
ఆ కథ జగ్గారెడ్డి మాటల్లోనే..
'మొన్న ఓ డాక్టర్ వద్దకు వెళ్లాను. డ్యామ్, బాడీ ఒకటే కదా.. అని ఇంటర్ లింక్ చేస్తున్నాను.. అది మెషీన్.. మనది మెషీన్.. ఈ మధ్యలో రాత్రి పూట నిద్ర పట్టట్లేదు.. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం తింటున్న.. రాత్రికి ఊరి కోడి ఒకటి తింటున్న అని చెప్పిన.. అదేట్ల సర్.. మీరు ఒకటేసారి ఒక కోడి తింటే ఎట్ల అని అన్నడు డాక్టర్. కొంత కొంత తినండి.. రాత్రికి కడుపు ఖాళీ పెట్టండి.. అరిగాక మళ్లీ తినండి.. అట్లయితే మీ బాడీ, మీరు సేఫ్టీగా ఉంటరు.. కోడి దొరికిందని మొత్తం తింటే ఎట్ల అని అన్నడు ఆయన.
ఇంత ఉందా అంటే ఇంతే ఇది. అట్ల మీరు కూడా కొన్ని కొన్ని నీళ్లు నింపి ఉంటే బాగుండేది.. నేను ఒకటే సారి కోడి తిన్నట్టు.. నువ్వు ఒక్కటే సారి నీళ్లు వదిలేసినవ్.. అదే కదా..? నాకు ఎట్ల ప్రాబ్లం అయిందో మేడిగడ్డ ప్రాబ్లం అదే. సేమ్ ప్రాబ్లం అదే.. అక్కడ హరీశ్‌రావు చేసిండు ఇక్కడ నాది నేను చేసుకున్నా.. తేడా గంతే.. ఊ అంటే రేవంత్ రెడ్డిని అంటే ఆయనేం చేస్తడు.. నువ్వు చేసిన కథకు. కోడిని బాగా తిని రేవంత్ రెడ్డిని తిడితే ఎట్ల.. ఏక్ దమ్ నీళ్లు ఎట్ల నింపినవ్.. ప్రజలు ఆలోచన చేయాలి. ఇది ప్రజల డబ్బు.. సొంత డబ్బు అయితే హరీశ్‌రావుకు తెలుస్తుండే. క్యూరింగ్ మంచిగా చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు.. మీరు చేసిన పాపాల వల్లే ఇలా తయారైంది రాష్ట్రం అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
మాకు రాదా తిట్టడానికి..? ఇంకా ఐదేండ్లు నేనే ఉంటా అని రేవంత్ రెడ్డి అంటున్నందుకు మేం ఎటు పోవాలి అని కాళేశ్వరం, మేడిగడ్డ పట్టుకుని తిరుగుతున్నారు.. బురద జల్లుకుంటూ పోతున్నారు హరీశ్‌రావు. దొంగ మాటలు, దొంగ లెక్కలు, దొంగ ముచ్చట్లు, దొంగ డైలాగులు చెప్పడంలో కేసీఆర్ ఫ్యామిలీ ఎక్స్‌పర్ట్.. వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ప్రజలు హరీశ్ రావు మాటలను నమ్మకండి. రేవంత్, ఉత్తమ్, కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్ కట్టలేదు.. వారే కట్టారు.. ప్రతి దానికి జవాబుదారీ బీఆర్ఎస్ నాయకులే. హరీశ్‌రావు ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దొంగ ప్రచారం ఆపకపోతే.. రాజకీయంగా ఎప్పటికప్పుడూ నిలదీస్తాం. వెనక్కిపోయే ప్రసక్తే లేదు' అని జగ్గారెడ్డి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
జులై 18, 2026

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



