త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chandrababu Naidu | తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. స్వాగతం పలికిన మంత్రి తుమ్మల

Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం పర్యటించారు. పాల్వంచలోని నవభారత్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు అక్కడి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు.

P

Telangana | Published On Nov 26, 2026, 8.07 pm IST

Chandrababu Naidu | తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. స్వాగతం పలికిన మంత్రి తుమ్మల
Advertisement

Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం పర్యటించారు. పాల్వంచలోని నవభారత్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు అక్కడి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. అంత‌కు ముందు చంద్రబాబు దంపతులకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల పుష్పగుచ్ఛం అందించి చంద్రబాబును శాలువాతో సత్కరించారు. అనంతరం పాల్వంచలోని ఆలయానికి చేరుకున్న చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

టీడీపీ శ్రేణుల సందడి

చంద్రబాబు తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిమానుల అభివాదాలకు చంద్రబాబు స్పందిస్తూ చేతులు ఊపారు. తనకు స్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, చంద్రబాబు కుటుంబంతో కలిసి దాదాపు 12 ఏళ్ల తర్వాత కొత్తగూడెం ప్రాంతానికి వచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. నవభారత్ వేంకటేశ్వరస్వామి ఆలయం పాల్వంచ పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

Advertisement
Advertisement