త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chanaka Korata Barrage | 2027 నాటికి చ‌న‌కా – కోరాట బ్యారేజీని పూర్తి చేస్తాం : మంత్రి తుమ్మ‌ల‌

Chanaka Korata Barrage | ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఎంతో మేలు చేసే చ‌న‌కా - కోరాట బ్యారేజీని 2027 డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేస్తామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Jan 3, 2026, 11.53 am IST

Chanaka Korata Barrage | 2027 నాటికి చ‌న‌కా – కోరాట బ్యారేజీని పూర్తి చేస్తాం : మంత్రి తుమ్మ‌ల‌
Advertisement

Chanaka Korata Barrage | త్రినేత్ర‌.న్యూస్ : ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఎంతో మేలు చేసే చ‌న‌కా - కోరాట బ్యారేజీని 2027 డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేస్తామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా చ‌న‌కా - కోరాట బ్యారేజీ నిర్మాణంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి తుమ్మ‌ల స‌మాధానం ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మ‌ల మాట్లాడుతూ.. చ‌నాక - కోరాట బ్యారేజీ కింద 13500 ఎక‌రాలు, దిగువ పెన్‌గంగా ప్రాజెక్టు కింద 37500 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నీరు అందించ‌డానికీ ఈ ప్రాజెక్టును నిర్మించుకుంటున్నాం. భూసేక‌ర‌ణ పెండింగ్‌లో ఉన్నందున ప‌నులు పూర్తి కావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు భూసేక‌ర‌ణ ఇత‌ర వ్య‌యాల‌తో పాటు చేసిన వ్య‌యం 1244.66 కోట్లు. ఇంకా రూ. 792. 91 కోట్ల నిధులు కావాల్సి ఉంది. 2027 డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేసేలా కేట‌గిరి బీ కింద ప్రాజెక్టుకు ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తుంది. ఆ ప్ర‌కారం 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో భూసేక‌ర‌ణకు, ఇత‌ర ప‌నుల కోసం రూ. 147 కోట్లు నిధులు కేటాయించ‌డం జ‌రిగింది. రూ. 71.96 కోట్లు భూసేక‌ర‌ణ బిల్లును ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ పీడీ ఖాతాకు జ‌మ చేయ‌డం జ‌రిగింది. ఈ ప్రాజెక్టును 2027 డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేసి మొత్తం 51 వేల ఎక‌రాల‌కు సాగు నీరు అందిస్తామ‌ని మంత్రి తుమ్మ‌ల స్ప‌ష్టం చేశారు.

చనాక-కోరాట ప్రాజెక్టు నిర్వాసిత రైతులతో కలిసి అసెంబ్లీకి పాయల్‌శంకర్

చనాక-కోరాట ప్రాజెక్టు నిర్వాసిత రైతులతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్ అసెంబ్లీకి బ‌యల్దేరారు. నిర్వాసిత రైతుల‌కు న్యాయం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్‌ వద్ద ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్‌తో పాటు రైతులను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement