Bellary | ఎస్పీ సస్పెన్షన్.. ఆత్మహత్యాయత్నం
Bellary | కర్ణాటక (Karnataka) రాష్ట్రం బళ్లారి (Bellary) ఎస్పీ పవన్ నిజ్జూర్ (Pawan Nijjur) ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డాడు.
Bellary | కర్ణాటక (Karnataka) రాష్ట్రం బళ్లారి (Bellary) ఎస్పీ పవన్ నిజ్జూర్ (Pawan Nijjur) ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డాడు. బళ్లారిలో ఫ్లెక్సీ ఏర్పాటు వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో కాల్పులు జరిగి, ఒక కాంగ్రెస్ కార్యకర్త సైతం మరణించాడు. ఈ ఘటనలో విధి నిర్వహణలో వైఫల్యం చెందారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్పీని సస్పెండ్ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు సమాచారం అందించడంలో విఫలమవడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ చర్యతో కుంగిపోయినా పవన్ నిద్రమాత్రలు మింగారు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మూడు రోజుల క్రితమే బళ్లారి ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే సస్పెన్షన్, ఆత్మహత్యాయత్నం వరుసగా జరగడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత వార్తలు

Bandi Sai Bhagirath | బండి భగీరథ్ అకృత్యాలు ఇవే..! రెండుసార్లు అమ్మాయి ఆత్మహత్యాయత్నం..!!
మే 10, 2026

Keralam Election Results | కాంగ్రెస్‌కు బూస్ట్.. కేరళంలో యూడీఎఫ్ కూటమి జయకేతనం..!
మే 4, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



