Telangana | ఘనా పారిశ్రామికాభివృద్ధికి ‘తెలంగాణ’ మార్గనిర్దేశం
అక్కడ ‘ఫార్మా హబ్’ ఏర్పాటుకు పూర్తిస్థాయి సహకారం
రిపబ్లిక్ ఆఫ్ ఘనా ఉన్నత స్థాయి బృందం భేటీలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
Telangana | త్రినేత్ర.న్యూస్ : రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ‘ఫార్మా హబ్’కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒబువాడుం టానో నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బుధవారం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా ‘తెలంగాణ – ఘనా’ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఘనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 24 అవర్ ఎకానమీ అండ్ యాక్సలరేటెడ్ ఎక్స్ పోర్ట్ డెవలెప్ మెంట్ ప్రోగ్రాం, ఫార్మా హబ్ ఏర్పాటు తదితర అంశాలను ఆగస్టస్ ఒబువాడుం టానో వివరించారు. ఘనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనకు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబును విజ్ఞప్తి చేశారు.
అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఆనతికాలంలోనే పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, అడ్వాన్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీ’లను ఆయన వివరించారు. ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, వ్యాక్సీన్ల తయారీ, గ్లోబల్ సప్లై చైన్ నిర్వహణ, లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకున్న అంతర్జాతీయ నైపుణ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఘనా ప్రతినిధులకు చెప్పారు. ఘనా పారిశ్రామిక, ఆర్థిక పరివర్తనలో తెలంగాణ ఒక నమ్మకైన భాగస్వామిగా ఉంటుందని భరోసానిచ్చారు.
సంబంధిత వార్తలు

TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
జులై 28, 2026

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
జులై 27, 2026

Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చడం పాలన అనిపించుకోదు
జులై 27, 2026
తాజావార్తలు
- ●RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్
- ●Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!
- ●TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
- ●South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?
- ●Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

RGV on NEET | విద్యావ్యవస్థను చంపేయండి.. అసలు నీట్‌కు ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు?: ఆర్జీవీ సంచలన పోస్ట్

Cockroach Janta Party | "ఏ ఒక్కరినీ వదిలిపెట్టం": అర్ధరాత్రి ప్రభుత్వంతో CJP చర్చలు సఫలం.. కేసుల మాఫీకి హామీ!

TG SET 2026 | టీజీ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు

South Central Railway | 16 గంటలు రైలు ఆలస్యం.. దక్షిణ మధ్య రైల్వేకు రూ. 25 వేల జరిమానా



