త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Sridhar Babu | గంగాపురిలో గార్మెంట‌రీ యూనిట్‌కు శంకుస్థాప‌న చేసిన మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

Minister Sridhar Babu | ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్ల 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీ‌ధ‌ర్‌బాబు (Minister Sridhar Babu), పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ‌ బుధ‌వారం శంకుస్థాప‌న చేశారు.

D

Telangana | Published On May 6, 2026, 5.33 pm IST

Minister Sridhar Babu | గంగాపురిలో గార్మెంట‌రీ యూనిట్‌కు శంకుస్థాప‌న చేసిన మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు
Advertisement

Minister Sridhar Babu | త్రినేత్ర‌.న్యూస్‌: ఉపాధి అవకాశాల విస్తరణకు తోడ్పడే విధంగా రూ. 7 కోట్ల 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే గార్మెంటరీ యూనిట్‌కు గంగాపురి వద్ద రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీ‌ధ‌ర్‌బాబు (Minister Sridhar Babu), పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ‌ బుధ‌వారం శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గార్మెంటరీ యూనిట్ ద్వారా స్థానిక మహిళలు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ యూనిట్ స్థాపనతో మంథని పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం కలుగుతుందని, ముఖ్యంగా మహిళా స్వయం ఉపాధి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read..

బీఆర్ఎస్ నాయ‌కుడు క్రిశాంక్‌కు బెయిల్‌

ఫొటోగ్ర‌ఫీ ఎక్స్‌ప‌ర్ట్ ఫోన్‌.. లాంచ్ చేసిన వివో.. ధ‌ర ఎంతంటే..

నువ్వు తాలు తీస్తే.. నీ తోలు రైతులు తీస్త‌రు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చ‌రిక‌

Advertisement
Advertisement