KTR | నువ్వు తాలు తీస్తే.. నీ తోలు రైతులు తీస్తరు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక
KTR | ధాన్యం కొనుగోళ్ల విషయంలో నువ్వు తాలు తీస్తే.. నీ తోలు రైతులు తీస్తరు యాది పెట్టుకో రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో నువ్వు తాలు తీస్తే.. నీ తోలు రైతులు తీస్తరు యాది పెట్టుకో రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మేడిగడ్డ విషయంలో హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రజలకు స్పష్టత వచ్చింది. కాళేశ్వరం పేరుమీద ఇన్ని రోజులు చెప్పిన ఝూటా మాటలు అవాస్తవాలు అని తేలిపోయింది. ఇప్పట్నుంచి ఎవడన్న లక్ష కోట్ల అవినీతి అని మాట్లాడితే.. అవినీతి ఎక్కడుందని ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలే నా కొడుకా అని. హైకోర్టు తీర్పు ఇచ్చినాక ఇంకా ఏంది నీ నాటకాలు అని నిలదీయాలే. సర్కార్ తుమ్మలు మొలిచిన కాకతీయ కాల్వల్లో కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చిన మాట వాస్తవం కాదా..? ఆ రోజు మేడిగడ్డను కూడా బాంబులు పెట్టి పేల్చేండ్రు. చెక్ డ్యామ్‌లను పేల్చుతున్నరు.. వడ్లు కొనే తెలివి మక్కలు కొనే తెలివి లేదు.. కానీ పైసల కోసం చెక్ డ్యామ్‌లను పేల్చుతున్నరు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి ముక్కలవుతుంది..
కాంగ్రెస్ నేతల కాళ్లు పట్టుకోకండి.. కాలర్ పట్టుకొని నిలదీయండి.. దండం పెట్టకండి.. పిండం పెట్టండి. నువ్వు తాలు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు యాది పెట్టుకో నా కొడుకా. మక్కలు కొనకపోతే నీ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి ముక్కలవుతుంది అని కేటీఆర్ హెచ్చరించారు.
రాబందు రాజ్యం పోతది.. రైతుబంధు కేసీఆర్ రాజ్యం వస్తది..
బడే బాయ్ చెప్పినట్టు చోటే బాయ్ ఆడుతున్నడు. రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు.. బావుల కాడ మీటర్లు పెట్టేందుకు.. రైతన్నలు పసిగట్టకపోతే మునిగిపోతాం అని అప్రమత్తం చేస్తున్నా.. వీళ్ల పాలన ఎక్కువ రోజులు ఉండదు.. ఆత్మహత్యలు వద్దు.. గుండె ధైర్యం కోల్పోవద్దు.. రాబందు రాజ్యం పోతది రైతుబంధు కేసీఆర్ రాజ్యం వస్తది. ఎక్కువ రోజులు దాక్కోలేవ్ కొడుకా.. వరి ధాన్యం, మక్కలు కొంటావా.. లేదా 70 లక్షల మంది రైతుల చేతుల్లో దెబ్బలు తింటావా..? తేల్చుకో.. అష్టదిగ్బందం చేస్తాం.. నిలదీస్తాం ఉరికిస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



