త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

vivo X300 FE | ఫొటోగ్ర‌ఫీ ఎక్స్‌ప‌ర్ట్ ఫోన్‌.. లాంచ్ చేసిన వివో.. ధ‌ర ఎంతంటే..

vivo X300 FE | మొబైల్స్ త‌యారీదారు వివో త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఎక్స్‌300 ఎఫ్ఈని భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎక్స్‌300 సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కాగా, ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. లైఫ్ స్టైల్ ఓరియెంటెడ్ ఫ్లాగ్‌షిప్ రూపంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు.

S

Technology | Published On May 6, 2026, 5.23 pm IST

vivo X300 FE | ఫొటోగ్ర‌ఫీ ఎక్స్‌ప‌ర్ట్ ఫోన్‌.. లాంచ్ చేసిన వివో.. ధ‌ర ఎంతంటే..
Advertisement

vivo X300 FE | మొబైల్స్ త‌యారీదారు వివో త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఎక్స్‌300 ఎఫ్ఈని భార‌త మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎక్స్‌300 సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కాగా, ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. లైఫ్ స్టైల్ ఓరియెంటెడ్ ఫ్లాగ్‌షిప్ రూపంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్మాల్ ఫామ్ ఫ్యాక్ట‌ర్‌ను క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ఇది హై ఎండ్ ఇంట‌ర్న‌ల్ స్పెసిఫికేష‌న్స్‌తో వ‌స్తుంది. అడ్వాన్స్‌డ్ కెమెరా హార్డ్‌వేర్‌ను ఇందులో ఇచ్చారు. ఇందుకు గాను జెయిస్ కంపెనీతో వివో భాగ‌స్వామ్యం అయింది. అలాగే ప‌లు అద్భుత‌మైన ఏఐ ఫీచ‌ర్ల‌ను సైతం అందించారు. వివో ఎక్స్‌300 ఎఫ్ఈ ఫోన్‌లో 6.31 ఇంచుల ఫ్లాట్ డిస్‌ప్లే ఉండ‌గా, ఇది 5000 నిట్స్ వ‌ర‌కు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. అందువ‌ల్ల ఔట్‌డోర్‌లోనూ తెర‌ను స్ప‌ష్టంగా వీక్షించ‌వ‌చ్చు.

ఫొటోగ్రఫిక్ కెమెరాలు..

ఈ ఫోన్‌ను ఎరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందించారు. అందువ‌ల్ల బిల్డ్ క్వాలిటీ దృఢంగా ఉంటుంది. మృదువైన రైండ్ ఎడ్జ్‌ల‌ను క‌లిగి ఉంటుంది. ఈ కార‌ణంగా ఫోన్‌కు అద్భుత‌మైన ప్రీమియం లుక్ వ‌చ్చింది, కెమెరా మాడ్యూల్‌ను హారిజాంట‌ల్ లే అవుట్‌లో ఇచ్చారు. ఫ్లోటింగ్ డ్రాప్లెట్ కోల్డ్‌-స్క‌ల్ప్టింగ్ డిజైన్‌ను క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను అర్బ‌న్ ఆలివ్‌, లైలాక్ ప‌ర్పుల్‌, నాయిర్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. జెయిస్ కంపెనీకి చెందిన లెన్స్‌ను వాడినందున కెమెరాలు అద్భుత‌మైన క్వాలిటీని ఇస్తాయి. యూజ‌ర్లు టాప్ క్వాలిటీ ఫొటోలు, వీడియోల‌ను చిత్రీక‌రించుకోవ‌చ్చు. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ ప్ర‌ధాన కెమెరా ఉంది. మ‌రో 50 మెగాపిక్స‌ల్ టెలిఫోటో కెమెరాను ఇచ్చారు. దీంతో 100ఎక్స్ వ‌ర‌కు డిజిట‌ల్ జూమ్ ల‌భిస్తుంది. అలాగే మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌ను ఇచ్చారు. ముందు వైపు 50 మెగాపిక్స‌ల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది.

ఏఐ ఫీచ‌ర్లు..

ఈ ఫోన్‌లో ప‌లు ఏఐ ఫీచ‌ర్ల‌ను సైతం అందిస్తున్నారు. ఏఐ ట్రూ క్లారిటీ ఇంజిన్‌తో ఫొటోల‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవ‌చ్చు. 200 మెగాపిక్స‌ల్ వ‌ర‌కు ఇమేజ్‌ల‌ను సైజ్ పెంచుకోవ‌చ్చు. అలాగే 4కె వీడియోల‌ను 60ఎఫ్‌పీఎస్‌తో షూట్ చేయ‌వ‌చ్చు. 8కె వీడియో రికార్డింగ్ కూడా స‌పోర్ట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ లో ఇమేజింగ్‌, ఆడియో, సిస్ట‌మ్ ఆప‌రేష‌న్స్ కోసం ప్ర‌త్యేక ఏఐ టూల్స్‌ను ఇచ్చారు. ఏఐ క్రియేటివ్ కెమెరా, ఏఐ ఎడిటింగ్ టూల్స్‌, సిస్ట‌మ్ ఏఐ వంటి స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ 5 ప్రాసెస‌ర్ ఉండ‌గా, 12జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. కూలింగ్ కోసం ప్ర‌త్యేకంగా లిక్విడ్ కూలింగ్ సిస్ట‌మ్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల అధిక ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద కూడా ఫోన్ హీట్‌కు గురి కాకుండా ఉంటుంది. 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీ ఇందులో ఉంది. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. అలాగే కాంటాక్ట్ లెస్ పేమెంట్ల కోసం ఎన్ఎఫ్‌సీ స‌దుపాయాన్ని కూడా ఇచ్చారు.

ఫైవ్ స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్‌..

ఈ ఫోన్ ఐపీ68, 69 వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్‌ను క‌లిగి ఉంది. మిలిట‌రీ గ్రేడ్ నాణ్య‌త‌తో బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. క‌నుక ఫోన్ అంత సుల‌భంగా ప‌గ‌ల‌దు. ఈ ఫోన్‌కు ఉండే డిస్‌ప్లే గ్లాస్ ఫైవ్ స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది. అలాగే అథెంటికేష‌న్ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 ఉంది. దీనికి 5 ఏళ్ల వ‌ర‌కు ఓఎస్ అప్‌గ్రేడ్స్‌ను, 7 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను ఇందులో వేసుకోవ‌చ్చు. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లేదు. 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 7, బ్లూటూత్ 6.0, యూఎస్‌బీ టైప్ సి వంటి క‌నెక్టివిటీ స‌దుపాయాల‌ను ఇచ్చారు.

ధ‌ర‌, ఆఫ‌ర్ల వివ‌రాలు..

వివో ఎక్స్‌300 ఎఫ్ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.79,999 ఉండ‌గా, 12జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.89,999గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్‌కు ప్ర‌త్యేక యాక్స‌స‌రీల‌ను సైతం ఇస్తున్నారు. వాటిని వినియోగ‌దారులు విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వివో జెయిస్ టెలిఫొటో ఎక్స్‌టెండ‌ర్ యాక్స‌స‌రీస్ కిట్‌ను రూ.3,999కి పొంద‌వ‌చ్చు. అలాగే జెయిస్ టెలిఫొటో ఎక్స్‌టెండ‌ర్ జెన్ 2ను రూ.15,999కి ఇస్తున్నారు. వివో ఎక్స్300 ఎఫ్ఈ, ఎక్స్‌టెండ‌ర్‌, యాక్స‌సరీస్ కిట్ అన్నింటినీ క‌లిపి ఒకేసారి కొంటే రూ.99,997కి పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్‌ను వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, ఇత‌ర ఆఫ్ లైన్ స్టోర్స్‌లో మే 14 నుంచి విక్ర‌యించ‌నున్నారు. ప్రీ బుకింగ్స్‌ను బుధ‌వారం ప్రారంభించారు. ప్రీబుకింగ్ చేసుకున్న వారికి యాక్స‌సరీల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ఇస్తున్నారు. 24 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం, జీరో డౌన్ పేమెంట్ స‌దుపాయం కూడా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకుల కార్డుల‌తో 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.5వేల వ‌ర‌కు అప్‌గ్రేడ్ బోన‌స్‌ను ఇస్తారు.

Advertisement
Advertisement