త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Towers | ఉచితంగా రిజిస్ట్రేష‌న్‌.. ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ ల‌బ్ధిదారుల‌కు గుడ్‌న్యూస్‌

Indiramma Towers | హైద‌రాబాద్‌లో పేద‌ల‌కు సొంతింటి క‌ల‌ను నిజం చేసేందుకు ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ (Indiramma Towers) ల‌బ్ధిదారుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచితంగా ఇంటిని రిజిస్ట్రేష‌న్ (Registration) చేసి ఇవ్వ‌నుంది.

G

Hyderabad | Published On Nov 24, 2026, 1.03 pm IST

Indiramma Towers | ఉచితంగా రిజిస్ట్రేష‌న్‌.. ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ ల‌బ్ధిదారుల‌కు గుడ్‌న్యూస్‌
Advertisement

Indiramma Towers | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లో పేద‌ల‌కు సొంతింటి క‌ల‌ను నిజం చేసేందుకు ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ (Indiramma Towers) ల‌బ్ధిదారుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచితంగా ఇంటిని రిజిస్ట్రేష‌న్ (Registration) చేసి ఇవ్వ‌నుంది. ఈ మేర‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్ల‌డించారు. ఇందిరమ్మ టవర్స్ ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి దాదాపు రూ.50 నుంచి రూ.60 లక్షల విలువైన ఆస్తిని అందించడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్న‌ట్లు తెలిపారు.

ఇందిరమ్మ టవర్స్‌కు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA)లో రిజిస్ట్రేషన్ పూర్తి కావడం గొప్ప విషయం. ప్రభుత్వ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదవడం, పేదలకు ఇండ్లు అందించడంలో ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమ‌ని చెప్పారు. దీంతో సామాన్యుల సొంతింటి కల సాకారం దిశగా కీలక ముందడుగు ప‌డిన‌ట్ల‌యింద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం నుంచి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారుడికి అప్పగించే వరకు ప్రతి దశలో జవాబుదారీతనంతో ముందుకు సాగుతున్నామ‌ని వెల్ల‌డించారు.

రెరాలో రిజిస్ట్రేషన్ కావడంతో, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంలో జాప్యం జరిగినా, నిబంధనలను ఉల్లంఘించినా, లబ్ధిదారులు ఫిర్యాదు చేయడానికి అవకాశం లభించింద‌న్నారు. ఫిర్యాదు అందితే బిల్డ‌ర్ల‌కు నోటీసులు జారీ చేయ‌డంతోపాటు సంతృప్తిక‌ర‌మైన వివ‌ర‌ణ లేక‌పోతే జ‌రిమానా కూడా విధించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. శంకుస్థాపన జరిగిన ఏడాదిలోపు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇండ్లు అందించనున్నామ‌ని తెలిపారు.

హైద‌రాబాద్‌లోని 26 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ట‌వ‌ర్లు నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో 4 ట‌వ‌ర్ల చొప్పున, ఒక్కో ట‌వ‌ర్‌లో 120 ఫ్లాట్లు క‌లిపి మొత్తం 480 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ ఖ‌ర్చు రూ.11 ల‌క్ష‌లు కాగా ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌లు స‌బ్సిడీగా ఇస్తున్న‌ది. మిగ‌తా రూ.6 ల‌క్ష‌ల‌ను ల‌బ్ధిదారులు విడ‌త‌ల వారీగా

Advertisement

తాజావార్తలు

Advertisement