Motorola Edge 70 Neo | మోటోరోలా ఎడ్జ్ 70 నియో లాంచ్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదుర్స్..
Motorola Edge 70 Neo | మోటోలా భారత మార్కెట్లో ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6.8 ఇంచుల 1.5కె 144 హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 50 మెగాపిక్సల్ సోనీ కెమెరా దీని ప్రధాన ఆకర్షణలు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.40,999గా నిర్ణయించింది.
Technology | Published On Nov 24, 2026, 1.42 pm IST
Motorola Edge 70 Neo | మోటోలా భారత మార్కెట్లో ఎడ్జ్ 70 నియో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6.8 ఇంచుల 1.5కె 144 హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 50 మెగాపిక్సల్ సోనీ కెమెరా దీని ప్రధాన ఆకర్షణలు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.40,999గా నిర్ణయించింది.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత్‌లో తన కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 నియోను విడుదల చేసింది. ఇందులో 6.8 ఇంచుల అమోలెడ్ సూపర్ హెచ్‌డీ 1.5కె క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను అందించింది. 1272పి రిజల్యూషన్, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 5,200 నిట్స్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్10+ వంటి ఫీచర్లు ఉన్నాయి. తడి చేతులతో కూడా ఫోన్‌ను ఉపయోగించుకునేలా వాటర్ టచ్ సపోర్ట్ కల్పించింది. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఇచ్చింది. మౌంటెన్ వ్యూ, గ్రే లైలాక్, మిల్కీ బ్లూ, సేజ్ రంగుల్లో సిల్క్, ఎసిటేట్, లెదర్ తరహా ఫినిషింగ్‌లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
ఏఐ ఫీచర్లతో కెమెరాలు..
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50 మెగాపిక్సల్ సోనీ ఎల్‌వైటీఐఏ 710 ప్రధాన కెమెరాను అందించింది. ఆటోమేటిక్ మోషన్ డిటెక్షన్, వేగవంతమైన షటర్ రెస్పాన్స్, వీడియో హెచ్‌డీఆర్, 4కె వీడియో రికార్డింగ్, 10ఎక్స్ సూపర్ జూమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 3 ఇన్ 1 లైట్ సెన్సార్ ఇచ్చింది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించింది. ముందు, వెనుక కెమెరాల్లో 4కె వీడియో రికార్డింగ్, అడాప్టివ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్నాయి. కెమెరా యూఐ 5.0తోపాటు పోర్ట్రెయిట్ మోడ్, డైనమిక్ బొకే, ఆటో నైట్ విజన్, ఆటో స్మైల్ క్యాప్చర్, డ్యుయల్ క్యాప్చర్, ప్రో మోడ్, పనోరమా, లైవ్ ఫిల్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ ఫొటోస్ ద్వారా ఆస్క్ ఫొటోస్, ఫొటో టు వీడియో, మ్యాజిక్ ఎరేజర్, ఫొటో అన్‌బ్లర్, పోర్ట్రెయిట్ లైట్, రీమాజిన్, సినిమాటిక్ ఫొటోస్ వంటి ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
భారీ బ్యాటరీ..
క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్నాయి. 4,466 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, ఏఐ ర్యామ్ బూస్ట్ సపోర్ట్ కల్పించింది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఎక్స్‌తో పనిచేస్తుంది. మూడు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 2031 వరకు సెక్యూరిటీ మెయింటెనెన్స్ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 45 వాట్స్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 7.5 వాట్స్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ, ఐపీ64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, ఎస్‌జీఎస్ సర్టిఫైడ్ మిల్-ఎస్‌టీడీ-810హెచ్ డ్యూరబిలిటీ కూడా ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 6.0, వైఫై 6, 5జి, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ధర వివరాలు..
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.40,999కు విడుదల చేసింది. పది రోజుల పరిమిత కాల ఆఫర్‌లో రూ.3వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో ధర రూ.37,999కు తగ్గుతుంది. ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులతో మరో రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని అర్హతలు వర్తించే సందర్భంలో ప్రారంభ ఆఫర్లు కలిపి ఫోన్‌ను రూ.34,999 ప్రభావవంతమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. జియో రూ.399 రీఛార్జ్‌పై 12 నెలల కాన్వా ప్రొ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. దీని విలువ రూ.4వేలుగా పేర్కొంది. డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, రిలయన్స్ డిజిటల్ సహా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
సంబంధిత వార్తలు

Lava Smart 4 Pro | రూ.10వేలకే లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ..
నవంబర్ 20, 2026

Motorola Moto G Max | భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్.. మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఆగస్టు 14, 2026

realme 16x 5G | 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లే.. రియల్‌మి 16ఎక్స్ 5జి ఫోన్ లాంచ్..
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజయ్ ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం
- ●Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సందడి.. హోటల్లో చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు
- ●SEBI | ఐపీఓ జీఎంపీ ప్రచారానికి సెబీ బ్రేకులు.. మధ్యవర్తులకు కీలక ఆదేశాలు..
- ●Indiramma Towers | ఉచితంగా రిజిస్ట్రేషన్.. ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
- ●Road Accident | దైవ దర్శనానికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు.. హైదరాబాద్‌కు చెందిన దంపతులు ఎలా చనిపోయారంటే!
- ●Sonia Gandhi | ఆత్మకథలో సావర్కర్‌పై వ్యాఖ్యలు.. సోనియా గాంధీకి లీగల్ నోటీసులు

Madras High Court | మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే అసభ్యకర మెసేజ్‌లు.. విజయ్ ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సందడి.. హోటల్లో చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు

SEBI | ఐపీఓ జీఎంపీ ప్రచారానికి సెబీ బ్రేకులు.. మధ్యవర్తులకు కీలక ఆదేశాలు..

Indiramma Towers | ఉచితంగా రిజిస్ట్రేషన్.. ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్



