త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సంద‌డి.. హోట‌ల్లో చాయ్ తాగుతూ స్థానికుల‌తో ముచ్చ‌ట్లు

Vijay Antony | బిచ్చ‌గాడు ఫేమ్, కోలీవుడ్ హీరో విజ‌య్ ఆంటోనీ (Vijay Antony) హైదరాబాద్‌ (Hyderabad)లోని అమీర్‌పేటలో మంగ‌ళ‌వారం సంద‌డి చేశారు.

S

Telangana | Published On Nov 24, 2026, 1.26 pm IST

Vijay Antony | అమీర్‌పేట వీధుల్లో హీరో విజయ్ ఆంటోనీ సంద‌డి.. హోట‌ల్లో చాయ్ తాగుతూ స్థానికుల‌తో ముచ్చ‌ట్లు
Advertisement

Vijay Antony | త్రినేత్ర న్యూస్: బిచ్చ‌గాడు ఫేమ్, కోలీవుడ్ హీరో విజ‌య్ ఆంటోనీ (Vijay Antony) హైదరాబాద్‌ (Hyderabad)లోని అమీర్‌పేటలో మంగ‌ళ‌వారం సంద‌డి చేశారు. ‘నాన్న కుట్టి’ సినిమా ప్రమోషన్‌లో నిన్న మాదాపూర్‌లోని ఓ గ‌ల్లీలో బ‌జ్జీలు వేయ‌గా ఈరోజు అమీర్‌పేట‌లోని ఓ హోట‌ల్లో చాయ్ తాగుతూ, బన్ మస్కా ఆస్వాదిస్తూ అక్క‌డున్న‌వారితో స‌ర‌దాగా ముచ్చ‌టించారు. హీరో వ‌చ్చాడ‌న్న విష‌యం తెలుసుకొని ఆయ‌న్ను చూసేందుకు జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. అందిరితో సెల్ఫీలు దిగి వారి ఉత్సాహ‌ప‌రిచారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

విజ‌య్ ఆంటోనీ క‌థానాయ‌కుడిగా న‌టించిన త‌మిళ మూవీ అప్పాకుట్టీ గ‌త వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమా నాన్న‌కుట్టి పేరుతో తెలుగులోకి డ‌బ్ అవుతోంది. తెలుగు వెర్ష‌న్ ఈనెల 27న రిలీజ్ కాబోతుంది. దీంతో ఆ మూవీ ప్ర‌మోష‌న్ కోసం ఆయ‌న హైద‌రాబాద్ న‌గ‌రానికొచ్చారు. ఈ ప్ర‌మోష‌న్స్‌లో విజ‌య్ ఆంటోనీతో పాటు హీరోయిన్ ప్రీతి అస్రానీ కూడా పాల్గొన్న‌ది.

Advertisement
Advertisement