Alleti Maheshwar Reddy vs Sridhar Babu | బడ్జెట్ అనేది ఓ పవిత్రమైన డాక్యుమెంట్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై శ్రీధర్ బాబు ఫైర్
Alleti Maheshwar Reddy vs Sridhar Babu | భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ చీటింగ్ బడ్జెట్ అని బీజేపీఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
Alleti Maheshwar Reddy vs Sridhar Babu | త్రినేత్ర.న్యూస్ : భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ చీటింగ్ బడ్జెట్ అని బీజేపీఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
బడ్జెట్ అనేది ఒక పవిత్రమైన డాక్యుమెంట్. వారికి అభిప్రాయాలు ఉండొచ్చు.. చెప్పొచ్చు. ఒక బడ్జెట్ అనే డాక్యుమెంట్‌ను చీటింగ్ డాక్యుమెంట్ అని ఎట్ల అంటరు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మేం తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పే అధికారం వారికి ఉంది. కానీ బడ్జెట్‌ను చీటింగ్ అంటారా..? నాలుగు కోట్ల మందికి సంబంధించిన బడ్జెట్ ఇది. పవిత్రమైన బడ్జెట్‌ను చీటింగ్ బడ్జెట్ అనడం సరికాదు అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ కలగజేసుకుని.. మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించబడుతుందని స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు డివియేట్ చేస్తూ పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హామీలకు నిధులు కేటాయించని బడ్జెట్‌ను చీటింగ్ బడ్జెట్ అంటే తప్పేముంది. బడ్జెట్‌లో ఏ రకంగా చీట్ చేశారో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. వారు దానికి సిద్ధమా..? కాగ్ రిపోర్టుతో పాటు ఇతర ఎవిడెన్స్‌తో పాటు ఏ రకంగా చీట్ చేశారో చెప్తా. తప్పుడు లెక్కలను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఫిగర్స్ తప్పుగా ఉన్నాయి. మొదలు పెట్టకముందే అసహనం వ్యక్తం చేయడం సరికాదు అని శ్రీధర్ బాబుపై ఏలేటి మండిపడ్డారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



