Anganwadi Recruitment | త్వరలోనే 15 వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. శాసనభలో మంత్రి సీతక్క ప్రకటన
Anganwadi Recruitment | రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త వినిపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని శాసనసభా వేదికగా మంత్రి సీతక్క ప్రకటించారు.
Anganwadi Recruitment | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త వినిపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని శాసనసభా వేదికగా మంత్రి సీతక్క ప్రకటించారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ డిసేబుల్ వెల్ఫేర్‌పై సమాధానంలో భాగంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
అంగన్‌వాడీ సెంటర్లకు సంబంధించి.. ఈ మధ్యకాలంలోనే ఫైల్ క్లియర్ అయింది. కోర్టుల్లో కేసులు ఉండే. కేసుల మూలంగా కొంత నోటిఫికేషన్ ఇవ్వడం ఆసల్యం అయింది. నోటిఫికేషన్‌కు సంబంధించి అన్ని సిద్ధం చేశాం.. సంతకం కూడా అయిపోయింది. త్వరలోనే కేబినెట్ ముందుంచి 15 వేల అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం అని మంత్రి సీతక్క ప్రకటించారు.
37 మొబైల్ యూనిట్ల ద్వారా సేవలు
హైదరాబాద్ లాంటి నగరాల్లో అంగన్‌వాడీ సెంటర్లు చాలా తక్కువగా ఉన్నాయి. కొత్తగా కట్టేందుకు స్థలాలు దొరకడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసొచ్చిన పేదల పిల్లలకు కూడా అంగన్ వాడీ సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ పరిధిలో 274 బస్తీల్లో 25,310 మందిని గుర్తించాం. ఇందులో పిల్లలు, గర్భిణీలు ఉన్నారు. వాళ్ల కోసం 37 మొబైల్ యూనిట్ల ద్వారా సేవలను అందించాలని నిర్ణయించాం. ఈ క్రమంలోనే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. టీకాలు ఇస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
నేను ఎప్పుడూ భయంతో భద్రంగా పని చేయాలనుకుంటాను..
నేను ఎప్పుడూ భయంతో భద్రంగా పని చేయాలనుకుంటాను. బుల్డోజర్ చేయాలనుకోను. వారంలో రెండు మూడు రోజులు నియోజకవర్గాల్లో తిరుగుతుంటాను. వాస్తవాలను చెప్పాలని అధికారులను ఆదేశిస్తాను. వాస్తవాలు చెప్పడం మూలంగా లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఈ సభ ద్వారా కోరేది ఒక్కటే.. వాస్తవాలు వాస్తవాలుగా అధికారులు చెబితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. సరి చేసుకునే అవకాశం ఉంటుంది అని సీతక్క పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minister Seethakka | మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. వడ్డీ లేని రుణపరిమితి రూ.10 లక్షలకు పెంపు: మంత్రి సీతక్క
మే 7, 2026

City Civil Court | ఆ మొబైల్స్ కొనుగోళ్లలో అవినీతి లేదు.. బీఆర్ఎస్ పార్టీకి కోర్టు మొట్టికాయ
మే 6, 2026

Seethakka | రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నబీజేపీ: మంత్రి సీతక్క
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



