త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | విద్య‌కు వ‌యసుతో సంబంధం లేదు : మంత్రి సీత‌క్క‌

Minister Seethakka | స్వయం సహాయక సంఘాలలోని మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అందరికీ విద్య.. అందరి బాధ్యత’ అనే నినాదంతో ఉల్లాస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

S

Telangana | Published On Sep 27, 2026, 4.26 pm IST

Minister Seethakka | విద్య‌కు వ‌యసుతో సంబంధం లేదు : మంత్రి సీత‌క్క‌
Advertisement

Minister Seethakka | త్రినేత్ర న్యూస్ : స్వయం సహాయక సంఘాలలోని మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అందరికీ విద్య.. అందరి బాధ్యత’ అనే నినాదంతో ఉల్లాస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రంలోని స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌ను అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన ఉల్లాస్ ప‌రీక్ష‌కు మ‌హిళ‌లు హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలో మంత్రి సీత‌క్క స్పందించారు.

విద్య‌కు వ‌యసుతో సంబంధం లేదు.. జీవితాల‌ను మార్చ‌గ‌ల అత్యంత శ‌క్తివంత‌మైన ఆయుధం విద్య అని సీత‌క్క పేర్కొన్నారు. ఉల్లాస్ ప‌రీక్ష‌కు హాజ‌రైన ల‌క్ష‌లాది మంది మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన మ‌హిళ‌ల‌కు నేరుగా 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం ల‌భించ‌నుంది. చ‌దువు మ‌ధ్య‌లో ఆపేసిన మ‌హిళ‌లు తిరిగి విద్య‌ను అభ్య‌సించేలా ఇందిరా మ‌హిళా శ‌క్తి కార్య‌క్ర‌మం ద్వారా సెర్ప్ ప్రోత్స‌హిస్తుంద‌ని సీత‌క్క తెలిపారు.

Advertisement
Advertisement