త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | ఆదివాసీల హ‌క్కులు అమ‌లు చేయ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త : మంత్రి సీత‌క్క‌

Minister Seethakka | ఆదివాసీల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించిందని, వాటిని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడటం ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదని, అందరితో కలిసి సోదరభావంతో ముందుకు సాగుతూ రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Aug 9, 2026, 5.48 pm IST

Minister Seethakka | ఆదివాసీల హ‌క్కులు అమ‌లు చేయ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త : మంత్రి సీత‌క్క‌
Advertisement

అశ్వరావుపేటలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

Minister Seethakka | త్రినేత్ర‌.న్యూస్ : ఆదివాసీల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించిందని, వాటిని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడటం ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదని, అందరితో కలిసి సోదరభావంతో ముందుకు సాగుతూ రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ఆమె వేడుకల్లో పాల్గొని, ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ జై ఆదివాసీ నినాదాలతో మారుమోగింది.

ఆదివాసుల చరిత్ర హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటాల చరిత్రేనని సీతక్క అన్నారు. సమ్మక్క-సారక్క, బిర్సా ముండా, రాంజీ గోండు, కొమరం భీమ్ వంటి ఆదివాసీ నాయకులు హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ఇళ్లు, ఉద్యోగాలు, అడవిపై హక్కుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణే వారి అస్తిత్వానికి ప్రతీకలని, వాటిని కాపాడుకోవాలని మంత్రి సూచించారు. కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసీ సమాజం అభివృద్ధి, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వేడుకలతో పాటు మంత్రి సీతక్క అశ్వరావుపేటలో మహిళా సమాఖ్య భవనాన్ని సందర్శించి, ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement
Advertisement