త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఆర్టీసీ ఉద్యోగుల‌కు కూడా ఇందిర‌మ్మ ఇండ్లు : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

Ponnam Prabhakar | రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగుల‌కు ర‌వాణా శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్( Ponnam Prabhakar ) శుభ‌వార్త వినిపించారు. రూ. 6 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న వారికి ఇందిర‌మ్మ ఇళ్లు( Indiramma Illu ) మంజూరు చేస్తున్నాం.. ఆ మాదిరిగానే రూ. 6 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు( RTC Employees ) ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని మంత్రి పొన్నం సూచించారు.

S

Telangana | Published On Jul 20, 2026, 3.50 pm IST

Ponnam Prabhakar | ఆర్టీసీ ఉద్యోగుల‌కు కూడా ఇందిర‌మ్మ ఇండ్లు : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగుల‌కు ర‌వాణా శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్( Ponnam Prabhakar ) శుభ‌వార్త వినిపించారు. రూ. 6 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న వారికి ఇందిర‌మ్మ ఇళ్లు( Indiramma Illu ) మంజూరు చేస్తున్నాం.. ఆ మాదిరిగానే రూ. 6 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు( RTC Employees ) ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని మంత్రి పొన్నం సూచించారు. ఆర్టీసీ పేదవాడి గుండె చప్పుడు.. పేదవాడికి సౌకర్యం ఉండే విధంగా యాజమాన్యం తీసుకుంటున్న చర్యల్లో మరింత బాధ్యత గా పని చేయాలని పొన్నం కోరారు.

బాగ్‌లింగంప‌ల్లిలోని ఆర్టీసీ క‌ళాభ‌వ‌న్‌లో న‌ర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవ‌ర్ దివంగ‌త కోలా శంక‌ర్ గౌడ్‌ కుటుంబ స‌భ్యుల‌కు టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల చేయూత కార్య‌క్ర‌మం ద్వారా రూ. 90,85,500 చెక్కును మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఇతర ఉన్న‌తాధికారులు, శంక‌ర్ గౌడ్ స‌తీమ‌ణి హేమ‌ల‌త‌, కుమారుడు హేమంత్, కుమార్తె శాలిని పాల్గొన్నారు. చెక్కును అందించిన అనంత‌రం పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌సంగించారు.

శంక‌ర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులు అండగా ఉన్నారు. శంక‌ర్ కుమారుడికి ఉద్యోగం ఇస్తాం. ఇల్లు కూడా మంజూరు చేశాం. ఆర్టీసీలో ఒక్కొక్క సమస్య పరిష్కారం చేస్తున్నాం. గత ప్ర‌భుత్వంలో ఆర్టీసీ సంఘాల‌ను ఎత్తేసి నిరంకుశంగా వ్య‌వ‌హ‌రించారు. ప్రజా ప్రభుత్వం రాగానే మహాల‌క్ష్మీ పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి నెలకు ఆర్టీసీకి రూ. 300 కోట్లు విడుదల చేసింది. రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి పొన్నం తెలిపారు.

క్యూర్ ప‌రిధిలో బ‌స్ టెర్మిన‌ల్

సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌలభ్యం, కార్మికుల సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతున్నాం. క్యూర్ ఏరియా పరిధిలో బస్ టెర్మినల్ నిర్మించుకుందాం. ఎంఎంటీఎస్, మెట్రోను ఆర్టీసీకి అనుసంధానం చేస్తున్నాం. గ్రామాల నుండి రాజధాని వరకు కొత్త రూట్‌లలో బస్సులు నడిపిస్తున్నామ‌ని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

ఎన్నిక‌ల త‌ర్వాత విలీన ప్ర‌క్రియ‌

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసే విష‌యంలో నలుగురు మంత్రులు, అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు ముందుకు వెళ్తాం. ఎన్నికల తర్వాత విలీన ప్రక్రియ కూడా ప్రారంభిస్తాం. సంస్థ అభివృద్ధికి మ‌నమంతా క‌లిసి శ్ర‌మిద్దాం. ఇది పేద ప్ర‌జ‌ల‌కు లైఫ్ లైన్‌.. ప్ర‌జా ర‌వాణాలో తెలంగాణ ఆర్టీసీ ముందుంటుంద‌ని పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement