త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న జ‌ర‌గాలి

Ponnam Prabhakar | కులగణన కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు.. దేశంలోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల హక్కులకు సంబంధించిన అంశం అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలి.. ఇదే మా ప్రధాన డిమాండ్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Oct 4, 2026, 7.25 pm IST

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న జ‌ర‌గాలి
Advertisement

ఇదే మా ప్ర‌ధాన డిమాండ్
టీ పీసీసీ ఓబీసీ బ‌హిరంగ స‌భ‌లో మంత్రి పొన్నం

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్ : కులగణన కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు.. దేశంలోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల హక్కులకు సంబంధించిన అంశం అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలి.. ఇదే మా ప్రధాన డిమాండ్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. శంషాబాద్ టీ పీసీసీ ఓబీసీ బ‌హిరంగ స‌భ‌లో మంత్రి పొన్నం పాల్గొని ప్ర‌సంగించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచేలా కులగణన నిర్వహించింది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యం చేసి సమగ్రంగా కులగణన నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బీహార్‌తో పాటు తెలంగాణ కూడా కులగణన నిర్వహించిన రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది అని పొన్నం పేర్కొన్నారు.

కులగణన కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి

గ్రామస్థాయి నుంచి దేశస్థాయి వరకు కులగణన కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. సమావేశాలు, ప్రజా సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా కులగణన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్ని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలు ఐక్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం పోరాడాలి. తెలంగాణ ఉద్యమం, స్వాతంత్య్ర‌ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాల్లో ప్రజల ఐక్యతే విజయానికి కారణమైంది. అదే స్ఫూర్తితో ఇప్పుడు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా పోరాడాలని పొన్నం పిలుపునిచ్చారు.

రిజ‌ర్వేష‌న్ ప‌రిమితిపై చ‌ర్చ జ‌ర‌గాలి

అనేక వెనుకబడిన వర్గాలకు ఇప్పటికీ తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదు. గ్రామపంచాయతీ స్థాయి నుంచి శాసనసభ, పార్లమెంట్ వరకు అన్ని స్థాయిల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి. తెలంగాణలో కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభ తీర్మానం చేసింది. కేబినెట్ నిర్ణయం తీసుకుని ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితి వంటి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ల విషయంలో ప్రామాణికమైన గణాంకాలు అత్యంత కీలకం. ప్రామాణికమైన గణాంకాల కోసం దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాలి అని మంత్రి డిమాండ్ చేశారు.

కులగణన - సామాజిక న్యాయానికి పునాది

ప్రతి సామాజిక వర్గం జనాభా, సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు రావాలి. కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం నిర్ణయించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన అధికారాలను వినియోగించి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలి. తెలంగాణ శాసనసభలో చేసిన తీర్మానాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలి. గ్రామసభల్లో కులగణనకు అనుకూలంగా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి తీసుకురావాలి. కులగణన కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్న పోరాటానికి తెలంగాణ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కులగణన - సామాజిక న్యాయానికి పునాది. అన్ని వర్గాలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement