Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా భూములను అమ్మడంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. నువ్వు ముఖ్యమంత్రివా? లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా? అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై మండిపడ్డారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా భూములను అమ్మడంపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. నువ్వు ముఖ్యమంత్రివా? లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా? అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై మండిపడ్డారు. ఎక్కడ ప్రభుత్వ భూములు (Government Lands) కనిపిస్తే అక్కడ అమ్మకోవడమేనా? అని నిలదీశారు. నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలిచ్చి.. నేడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ, ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నావంటూ ధ్వజమెత్తారు. ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైందంటూ నిలదీశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు బహిరంగలేఖ రాశారు.
`కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ.. నేడు రాయదుర్గం.. ఇలా ఎక్కడిక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తుండటం సిగ్గుచేటు. రాయదుర్గం పన్మక్త గ్రామంలోని సర్వే నం.83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో TGIIC వేలం వేయడానికి సిద్ధం కావడం తీవ్రంగా ఖండిస్తున్నాం.
అనుయాయులకు మేలు చేసేందుకా..
2020లో ఇవే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ రెడ్డి.. నేడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారు? ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాటనా?. జీవో నంబర్ 4 ద్వారా సర్వే నం.83ను హెరిటేజ్ సైట్‌గా గుర్తించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం.. వాటినే వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతోంది? మీ అనుయాయులకు మేలు చేసేందుకేనా?.
కోర్టు కేసులు.. యాజమాన్య వివాదాలు..
ఇదే సర్వే నంబర్‌లో గతంలో 6.2 ఎకరాలు సుమారు ఎకరాకు 237 కోట్ల చొప్పున వేలం వేస్తే, ఎస్‌బీఐ (SBI) కోర్టుకు ఎక్కింది. కోర్టు అంక్షితలు వేసింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉంది. అయినా అదే సర్వే నంబర్‌లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? న్యాయ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా?. ఈ భూమిపై యాజమాన్య వివాదాలు ఉన్నాయి, హెరిటేజ్ అంశం ఉంది, వక్ఫ్ హక్కుల (Waqf Lands) అంశం ఉంది. అనేక కోర్టు వివాదాలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు భూమి ఎవరిదో తేల్చకుండా వేలం వేయడం ఎందుకు?. భూమి ఎవరిదో తేల్చలేని ప్రభుత్వం.. భూమిని అమ్మడానికి మాత్రం ఎందుకు తొందరపడుతోంది?.
ఆ హక్కు ఎవరిచ్చారు?
రూ.2,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) ఎవరు ఇచ్చారు?. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. `ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము` అన్న హామీ ఏమైంది?. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను అమ్మబోమని చెప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాటలకు విలువ లేదా?. భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడే పరిస్థితి వచ్చింది.
టీజీఐఐసీ వేలాలను వెంటనే ఆపండి..
సుప్రీంకోర్టు కూడా ఆస్తిని పరిరక్షించడం, కొత్తగా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ (third-party interests) సృష్టించకుండా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద భూమిని వేలం వేసి కొత్త హక్కులు సృష్టించడం ఏ విధమైన పరిపాలనా బాధ్యత?. ఆగస్టు 17, 21 తేదీల్లో జరగనున్న TGIIC వేలాలను వెంటనే నిలిపివేయాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే సర్వే నం.83కు సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలు నిగ్గు తేల్చాలి.
చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్
హక్కులు, వివాదాలు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన హెరిటేజ్ భూములను (Heritage Lands) అమ్మాలని చూడటం దారుణం. రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించండి. అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదు.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండండి. లేదంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.` అంటూ రేవంత్‌పై హరీశ్ రావు మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
- ●Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
- ●Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు

Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?

Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్





