త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Job Mela | ఐసీఐసీఐలో 250 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు.. రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా..

Job Mela | ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఐసీఐసీఐ (ICICI Bank) నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆగ‌స్టు 14న సంగారెడ్డిలో (Sangareddy) ప్రత్యేక ఉద్యోగ మేళా (Job Mela) నిర్వహించ‌నుంది.

G

Telangana | Published On Aug 13, 2026, 12.24 pm IST

Job Mela | ఐసీఐసీఐలో 250 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు.. రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా..
Advertisement

Job Mela | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఐసీఐసీఐ (ICICI Bank) నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆగ‌స్టు 14న సంగారెడ్డిలో (Sangareddy) ప్రత్యేక ఉద్యోగ మేళా (Job Mela) నిర్వహించ‌నుంది. ఈ సంద‌ర్భంగా రిలేషన్‌షిప్ మేనేజర్ (Relationship Manager) పోస్టుల భర్తీ చేయ‌నుంది. మొత్తం 250 పోస్టుల కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.

పోస్టు పేరు: రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్‌
మొత్తం పోస్టులు: 250
అర్హ‌త‌లు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2024 నుంచి 2026 మధ్య గ్రాడ్యుయేష‌న్‌ పూర్తిచేసిన వారే అర్హులు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 25 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

జాబ్‌మేళా ఎక్క‌డంటే..

ఉద్యోగ మేళాను సంగారెడ్డి జిల్లాలోని పాత ఐటీఐ కళాశాల (ITI College) ప్రాంగణంలో నిర్వ‌హించుంది. ఆగస్టు 14న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళ‌ ప్రారంభం కానుంది. అర్హత కలిగిన యువత తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను, అవసరమైన ఇతర పత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన అర్హత ఉన్న యువత కూడా ఇందులో పాల్గొన‌వ‌చ్చు. ఇంటర్వ్యూ/ఇతర నియామక ప్రక్రియలో అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు.

 

Advertisement
Advertisement