త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sukumar Daughter | డైరెక్ట‌ర్ సుకుమార్ కూతురికి అంత‌ర్జాతీయ అవార్డ్ – ఈ సారి సింగ‌ర్‌గా!

గాంధీ తాత చెట్టు సినిమాతో డైరెక్ట‌ర్ సుకుమార్ కూతురు సుకృతివేణి నేష‌న‌ల్ అవార్డును అందుకుంది. తొలి అడుగులోనే తండ్రికి త‌గ్గ త‌న‌యురాలిగా నిరూపించుకుంది. తాజాగా సుకృతివేణి మ‌రో అరుదైన పుర‌స్కారాన్ని ద‌క్కించుకుంది. బోస్ట‌న్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో ఎన్‌సెంబ‌ల్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికైంది. సింగ‌ర్‌గా ఈ అవార్డును అందుకుంది.

N

Entertainment | Published On Aug 13, 2026, 12.49 pm IST

Sukumar Daughter | డైరెక్ట‌ర్ సుకుమార్ కూతురికి అంత‌ర్జాతీయ అవార్డ్ – ఈ సారి సింగ‌ర్‌గా!
Advertisement

Sukumar Daughter | డైరెక్ట‌ర్ సుకుమార్ బాట‌లోనే ఆయ‌న త‌న‌యురాలు సుకృతివేణి సినిమాల్లోకి అడుగుపెట్టింది. గాంధీ తాత చెట్టు సినిమాకుగాను ఉత్త‌మ బాల న‌టిగా నేష‌న‌ల్ అవార్డును అందుకుంది. తొలి సినిమాతోనే తండ్రికి త‌గ్గ త‌న‌యురాలిగా నిరూపించుకుంది.

నేష‌న‌ల్ అవార్డ్‌....

తాజాగా సుకృతివేణి మ‌రో అరుదైన పుర‌స్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ సారి సింగ‌ర్‌గా అంత‌ర్జాతీయ అవార్డును అందుకుంది. అమెరికాలోని బోస్టన్‌లో ఉండే అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్ లో సంగీత విభాగంలో ఎన్‌సెంబల్‌ ఎక్సెలెన్స్‌ అవార్డును ఎంపికైంది. ఫుల్‌ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకుంది.

272 మంది...

బోస్ట‌న్‌లోని బ‌ర్క్‌లీ కాలేజీ ఆఫ్ మ్యూజిక్‌ లో వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ మ్యూజిక్ పోగ్రామ్ కోసం సుకృతి వేణి ఎంపికైంది. ఈ స‌మ్మ‌ర్ మ్యూజిక్ పోగ్రామ్ స్కాల‌ర్ షిప్ కోసం మొత్తం 272 మంది ఆడిషన్ ఇవ్వగా, కేవలం 14 మందికి మాత్రమే ఎంపిక‌య్యారు. అందులో సింగ‌ర్స్ విభాగం నుంచి ఫుల్ స్కాల‌ర్‌షిప్ పొందిన ఏకైక విద్యార్థినిగా సుకృతివేణి నిలిచింది.

గాంధీ తాత చెట్టు...

ప‌ద్మావ‌తి మ‌ల్లాది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గాంధీ తాత చెట్టు సినిమాతో న‌టిగా మారింది సుకృతివేణి. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ క‌లిసి నిర్మించిన ఈ మూవీ అనేక ఫిల్ట్ ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైంది.

 

Advertisement
Advertisement