Telangana | బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. రేపే పథకం ప్రారంభం
Telangana | బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు
100 శాతం సబ్సిడీతో అందజేత
బీసీ మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
Telangana | త్రినేత్ర.న్యూస్ : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించే పథకాన్ని సచివాలయంలో గురువారం మ. 12 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నారు. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేయడం ఈ పథకం ప్రత్యేకత.
కుట్టు వృత్తిపై నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించడంతో పాటు, వారి ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆదాయాన్ని ఆర్జించే స్వయం ఉపాధి మహిళలుగా, భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
పథకం విధి విధానాలు, కేటాయించిన బడ్జెట్, లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు.
సంబంధిత వార్తలు

Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
ఆగస్టు 12, 2026

Dasoju Sravan | రాయదుర్గం సాక్షిగా 7 ఎకరాల భూ దోపిడీ : ఎమ్మెల్సీ దాసోజు
ఆగస్టు 12, 2026

Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ
- ●Jr NTR | ఎన్టీఆర్కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!
- ●Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..
- ●Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ
- ●Vakiti Srihari | ప్రతి పేదవాడి గుండెలో ఎర్ర సత్యం బతికే ఉన్నాడు : మంత్రి వాకిటి
- ●Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం

Amit Shah | నీట్ అంశంపై చర్చ.. స్పీకర్ ఓం బిర్లాకు అమిత్ షా లేఖ

Jr NTR | ఎన్టీఆర్కు సర్జరీ.. కోలుకునేందుకు 3 నెలలు..!

Delhi | షాకింగ్ అధ్యయనం.. ఢిల్లీలో ప్రతి 20 మందిలో ఒకరికి షుగర్, బీపీ..

Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ



